సాంకేతికపరంగా టి.రాజసింహ సంభాషణలు ఫరవాలేదు. వేణుగోపాల్ సినిమాటోగ్రఫీ పనితనం పాటల్లోనే ఎక్కువగా కనిపిస్తుంది. మణిశర్మ సంగీతం కూడా 'అప్ టు ది మార్క్'గా చెప్పలేం. ఒకటి రెండు పాటలు ఫరవాలేదనిపిస్తాయి. మార్తాండ్ కె.వెంకటేష్ ఎడిటింగ్ క్రిస్ప్ గా ఉంది. ఏవీఎం సంస్థకు తగినట్టుగానే నిర్మాణ విలువల కూడా ఉన్నాయి.
సినిమా ప్రథమార్థంలో క్యూరియాసిటీని పెంచే అంశాల కొరత కనిపిస్తుంది. విశ్రాంతి ట్విస్ట్ ఊహించగలిగేదే. ద్వితీయార్థంలో దర్శకుడు కొంత పట్టు సాధించారు. అయితే సందర్భోచితం కాని ఒకటి రెండు పాటలు అడ్డుతగులుతాయి. కథానుగుణంగా వరుణ్ కు స్క్రీన్ రొమాన్స్ చేసే అవకాశం తగ్గిపోవడం ఒకింత నిరాశ పరచే అంశం. ఓవరాల్ గా....భారీ అంచనాలు లేకుండా 'ఎవరైనా ఎపుడైనా' చూడాలనుకుంటే చూడొచ్చు.