'ఓయ్' రివ్యూ...
దర్శకుడు ఆనంద్ రంగా ఎంచుకున్న కథలో పొయిటిక్ ఆలోచనలు, హీరోహీరోయిన్ల పేర్లు వారి పాత్రల తీరుతెన్నులను ప్రతిబింబించేలా ఉండటం మెచ్చుకోలైన విషయాలు. అయితే ఆయన రాసుకున్న కథలో 'చుక్కల్లో చంద్రుడు', 'గీతాంజలి', నిన్నకాక మొన్న వచ్చిన 'శిశిరేఖా పరిణయం' వంటి చిత్రాల ఛాయలు కూడా కనిపిస్తాయి. ఆదర్శ భావాలున్న హీరోయిన్ ఫారిన్ సిగరెట్ అడగడం, కుక్కమెడలో బెల్ట్ తో పెళ్లయిన ఆడవాళ్లకు మెట్టెలు, మంగళసూతాన్ని పోల్చడం ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. హీరోయిన్ బర్త్ డే కి హీరో 12 గిఫ్టులను (నెలకో గిఫ్ట్ అన్నట్టుగా) హీరో ఇవ్వడం..పన్నెండో గిఫ్ట్ గా 'ఐ లవ్ యూ' అంటూ ప్రపోజ్ చే ఘట్టాన్ని దర్శకుడు యూత్ కోణం నుంచి బాగా రక్తికట్టించారు. ఇందుకు ప్రతిగా హీరోయిన్ చివర్లో ఇచ్చే గిఫ్ట్ ఎపిసోడ్ కూడా యూత్ ను కదిలిస్తుంది. అంతంతమాత్రంగా ఉన్న కామెడీ అంశాల స్థానే ఇలాంటి మరికొన్ని 'లవ్ లీ' అంశాలను దర్శకుడు చొప్పించి ఉండాల్సింది. జీవితంలో ఏమి పోగొట్టుకున్నామో దానిని పొందేందుకు ఓ వృద్ధ ఇల్లాలు (రాధాకుమారి) కొద్ది నిమిషాల పాటు చేసిన హంగామా ఆకట్టుకుంటుంది.
సిద్దార్ధకు ఈతరహా లవర్ బాయ్ పాత్రలు కొట్టనపిండే. అత్యంత సహజంగా పాత్రను పోషించారు. డెభ్బై ఏళ్ల వయసులోపు తీరాల్సిన కోరికలను ఏడు రోజుల్లో తీర్చడం ద్వారా తన ప్రేమికురాలి పట్ల అతను కనబరచిన శ్రద్ధ చూస్తే పెళ్లి కావాల్సిన ప్రతి యువతి ఇలాంటి భర్త కావాలని కోరుకోవడం సహజం. షామిలిలో ఓ కొత్త హీరోయిన్ ను చూస్తున్న ఫీలింగ్ కలుగదు. కాస్ట్యూమ్స్, మేకప్ విషయంలో తగిన శ్రద్ధ తీసుకుని ఉండాల్సింది. ఎక్కువగా చుడీదార్ లలోనే (అది కూడా అడపాదడపా మాత్రమే మారుతుంది) ఆమెను చూపించారు. బాలనటిగా తనకున్న అనుభవంతో సునాయాసంగానే తన పాత్రను పోషించింది. ఎటొచ్చీ తొలి సినిమాలోనే ఆమెను తగినంత గ్లామరస్ గా చూపకపోవడం, బరువైన పాత్ర ఇవ్వడం ఆడియెన్స్ ను నిరుత్సాహ పరచే అంశాలు. ఎల్ ఐసి ఏజెంట్ అభిషేక్ గా సునీల్ ప్రథమార్థంలో కొద్దిపాటి హాస్యం పండించినా ఆ తర్వాత ఆ పాత్ర విసుగెత్తించే విధంగా సాగింది. ఆలీ, మాస్టర్ భరత్, తనికెళ్ల భరణి కొద్దిపాటి నవ్వులు పూయించారు. సిద్దార్ధ ఫ్రెండ్ గా కృష్ణుడు ('వినాయకుడు' ఫేమ్) నటన గురించి పెద్దగా చెప్పుకోనవసరం లేనప్పటి ఆయన ఐదు గెటప్స్ లో కనిపించి మెప్పించారు. ప్రదీప్ రావత్ పాత్ర పేలవంగా ఉంది. హీరోయిన్ ఫ్రెండ్ గా సురేఖ వాణి, డాక్టర్ గా నెపోలియన్ గెస్ట్ రోల్స్ చేశారు. రావికొండలరావు-రాధాకుమారి జంట కనిపించినది కొద్దసేపైనా బాగా నటించారు.
Be first to comment on this News / Article!
Pages: -1- 2 -3-
|