'ఓయ్' రివ్యూ...
సాంకేతికపరంగా మంచి ప్రమాణాలు పాటించడం కనిపిస్తుంది. వినయ్ కె చక్రవర్తి ఫోటోగ్రఫీ పనితనం రిచ్ గా ఉంది. పలు ఫ్రేమ్ లు అందమైన పెయింట్స్ లా కనిపిస్తాయి. యువతరాన్ని ఇట్టే ఆకట్టుకునేలా యువన్ శంకర్ రాజా ట్యూన్స్ ఇచ్చారు. '176 బీచ్ హౌస్ లో' పాట హుషారెక్కిస్తే, 'కన్నువీడి చూపు పోయినా' అనే సోలో సాంగ్ కథాగమనానికి వెన్నుదన్నుగా నిలిచి ఆకట్టుకుంటుంది. మార్తాండ్ కె.వెంకటేష్ ఎడిటింగ్ ఓకే. శశి రాజసింహ సందర్భోచిత సంభాషణలు అందించారు. 'ఏం నటన...చైల్డ్ ఆర్టిస్టే కదా' (హీరోయిన్ తో హీరో) డైలాగ్ లు మంచి స్పందన వచ్చింది. డి.వి.వి.దానయ్య నిర్మాణ విలువల విషయంలో ఎక్కడా రాజీ పడలేదు.
ప్రథమార్థం డీసెంట్ గా ఉంది. ఇంటర్వెల్ ముందు వచ్చే మలుపు ద్వితీయార్థంపై ఆసక్తిని పెంచుతుంది. అయితే హీరో-హీరోయిన్ల వైజాగ్ టు కాశీ ట్రిప్ ఘట్టాలు, మధ్యలో ములుకుల్లా తోచే కామెడీ కన్నివేశాలు ప్రేక్షకుల్లో తగినంత క్యూరియాసిటీ నింపవు. క్లైమాక్స్ ఊహించగలిగేదే. సిద్దార్ధ నటన, షామిలి తొలిసారి హీరోయిన్ గా కనిపించడం, సంగీతం ప్రేక్షకులను థియేటర్లకు రప్పించగలిగే కీలకాంశాలు అవుతాయి. వినోదం వికటించడం, హీరోయిన్ పాత్రకు ఇచ్చిన ముగింపు ప్రేక్షకులను నిరాశరపచే అంశాలు. తెలుగులో ప్రేమకథలకు విషాదాంతమైన ముగింపు దాదాపు రిస్కే. ఏతావతా...'ఓయ్' పిలుపు బాక్సాఫీస్ కు చేరడానికి 50-50 ఛాన్సులున్నాయంతే..!
Be first to comment on this News / Article!
Pages: -1- -2- 3
|