'కలవరమాయే మదిలో' రివ్యూ
సాంకేతికపరంగా శరత్ వాసుదేవన్ సంగీతం అహ్లాదం గొలుపుతుంది. రణగొణ ధ్వనులు లేవు. 'తొలితొలి ఆశలెన్నొ రేపుతున్న థిల్లానా', 'పల్లవించిన...' వంటి పాటలు శ్రావ్యంగా ఉన్నాయి. వనమాలి సాహిత్యం గుభాళించింది. లక్ష్మీభూపాల్ మాటలు సందర్భోచితంగా ఉన్నాయి. రాజేంద్ర కాసాని సినిమాటోగ్రఫీ, బస్సా పైడిరెడ్డి ఎడిటింగ్ తగినట్టుగానే ఉన్నాయి. మోహన్ వడ్లపట్ల నిర్మాణ విలువలు కూడా ఓకే.
సినిమా ప్రథమార్థం కలర్స్ స్వాతి ట్రేడ్ మార్క్ స్టైల్, కొద్దిపాటి హ్యూమర్ తో నడుస్తుంది. విశ్రాంతి కార్డ్ సరైన ప్లేస్ లో పడినట్టు అనిపించదు. సెకెండాఫ్ లో ట్విస్ట్ తర్వాత కథ భారంగా సాగి బరువైన క్లైమాక్స్ తో ముగుస్తుంది. రెహ్మాన్ నుంచి పిలుపు వచ్చిందంటూ సంగీత పోటీలకు జడ్జిగా వచ్చిన కోటితో చెప్పించడంతో శ్రేయ అలియాస్ స్వాతి డ్రీమ్ నెరవేరినట్టు తేల్చేశారు. రెహ్మాన్ తో ఓ చిన్న సన్నివేశమో, లేకుంటే రెహ్మాన్ తో స్వాతి క్లిప్పింగ్ జోడించడమో ప్లాన్ చేసుంటే ఫినిషింగ్ టచ్, పబ్లిసిటీ బూస్టప్ కూ ఉపయోగించేది.స్వాతి నటన, శరత్ వాసుదేవన్ సంగతం సినిమాకి ఆకర్షణలైతే, పాతబడిన థీమ్, దర్శకుడు సతీష్ ప్రెజెంటేషన్ లో తగిన కొత్తదనం లోపించడం నిరాశపరచే అంశాలు. ఓవరాల్ గా తగినంత తీరుబడి, నిబ్బరం ఉంటే ఓసారి 'కలవరిం'చొచ్చు...
Be first to comment on this News / Article!
Pages: -1- -2- 3
|