'బాణం' రివ్యూ
సాంకేతికపరంగా మణిశర్మ సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో మంచి స్కోరింగే చేశారు. అనిల్ భండారి సినిమాటోగ్రఫీ చాలా సందర్భాల్లో కనులవిందు చేసింది. అన్నింటికంటే గంధం నాగరాజు ('గమ్యం' ఫేమ్) సంభాషణలకు పెద్దపీట వేయాల్సిందే. నిజానికి ఆయన సంభాషణల్లో సందేశం పాళ్లు ఎక్కువే అయినా...థీమ్ కు అనుగుణంగానే వాటిని అన్వయించుకోవాలి. 'మనకంటూ ఎవరూ లేనపుడు మన కోసం మనం బతగడమే జీవితం', 'ఏ వ్యక్తి కి మంచి జరిగినా చెడు జరిగినా మరో వ్యక్తి వల్లనే', 'ప్రపంచంలో అందరికీ అర్ధమయ్యే భాష నవ్వు', 'రౌడీ అనేవాడు రోజూ రోడ్డు మీద కనిపిస్తే జోకర్ అనుకుంటారు జనం', 'ప్రమాదాలు జరుగుతాయని ప్రయాణాలు మానుకోలేం కదా' వంటివి మచ్చుకు కొన్ని. మార్తాండ్ కె.వెంకటేష్ ఎడిటింగ్ సైతం ఓకే.
ఇవాల్టి స్పీడ్ టేకింగ్ యుగంలో 'స్లో అండ్ స్ట్రయిట్ నేరేషన్'ను దర్శకుడు ఎంచుకోవడం వల్ల అక్కడక్కడా డాక్యుమెంటరీ పోలికలు కనిపిస్తాయి. సీరియస్ సబ్జెక్ట్ ..సెన్సిబుల్ అంశాల వల్ల మల్టీప్లెక్స్ ఆడియెన్స్ కు దగ్గరగా ఉంది. ప్రథమార్థం సీరియస్ గా సాగడం ద్వారా ద్వితీయార్థంపై అంచనాలను పెంచుతోంది. అయితే సెకెండాఫ్ లో కూడా కథాగమనాన్ని దర్శకుడు స్పీడప్ చేయకపోవడం కనిపిస్తుంది. సంగీతం, సంభాషణలు, ఫోటోగ్రఫీ పనితనం ప్రధాన ఆకర్షణలయితే, వినోదం, మాస్ కోరుకునే మషాలా అంశాలు మృగ్యం. ఓవరాల్ గా...ఆఫ్ బీట్ సినిమాల పట్ల ఏమాత్రం ఆసక్తి ఉన్నా ఓసారి చూడొచ్చు.
Be first to comment on this News / Article!
Pages: -1- -2- 3
|