'నిన్ను కలిశాక' రివ్యూ
దర్శకుడు శివనాగేశ్వరరావు అనుభవజ్ఞుడే అయినప్పటికీ ఇందులో ఆయన ప్రతిభ ప్రదర్శించేందుకు అంతగా వీలులేకపోయింది. ఇందుకు స్క్రిప్టు కూడా ఓ కారణం. శివనాగేశ్వరరావు స్యయంగా పోషించిన ప్రేమ్ బాబా పాత్ర తీరుతెన్నులు ప్రేక్షకులను విస్తుపోయేలా చేస్తాయి. ప్రేమ గురించి లెక్చర్లు ఇవ్వడమే ఒక పాత్ర పరమార్ధం అయితే ఆ పాత్ర వల్ల మెయిన్ థీమ్ కు కానీ, మెయిన్ పెయిర్ (ప్రధాన జంట)కు కానీ ఒరిగేదేముంటుంది? అదే జరిగింది కూడా. మ్యూజిక్ డైరెక్టర్ కావాలనుకునే చందు బావ పాత్ర కూడా అర్ధంపర్ధంలేని చేష్టలతో విసిగించేదే. ఎమ్మెస్ నారాయణ-మాస్టర్ భరత్ ల 'సి' గ్రేడ్ కామెడీ కూడా నిడివి పెంచుకునే యత్నంగానే చెప్పాలి. బట్టతల కేశవ ఎపిసోడ్లు సైతం ఎవరికి వారు కితకితలు పెట్టుకోవాల్సిందే. నిజానికి ఇలాంటి పసలేని సైడ్ ఫ్లేవర్లు కంటే ప్రధాన ప్రేమ జంటలపై మరింత ఫోకస్ చేసి ఉండొచ్చు. ఒకరిని ప్రేమించి అనుకోని పరిస్థితిలో మరొకరి ప్రేమలో పడి...కిం కర్తవ్యం అంటూ సదరు ప్రేమికుడు వేరేవాళ్లని సలహా అడగడమంటే అది ప్రేమలోని అపరిపక్వతనే చాటుతుంది. హీరో అభి పాత్ర చివరకు ఇలాంటి పలచనకే గురవుతుంది. స్క్రిప్టు బలహీనతకు ఇదో ఉదాహరణ. టైటానిక్ స్టేజ్ షో, ప్రేమకు చావులేదనే కాన్సెప్ట్ తో చూపించిన మరో స్టేజ్ షో ఆకట్టుకుంటాయి.
చైతన్య లో నవదీప్ పోలికలు ఉన్నాయి. ఫోటోజెనిక్ ఫేస్ కూడా. డాన్సులు బాగా చేశాడు. యాక్టింగ్ స్కిల్స్ పెంచుకుంటే మునుముందు హీరోగా రాణించే అవకాశాలుంటాయి. సంతోష్ సామ్రాట్ నటనలో కొంత ఈజ్ ఉంది. మునుముందు ఫిజిక్ డవలప్ చేసుకుని, డాన్సుల్లో
పరిణతి సాధించాల్సి ఉంటుంది. ప్రియ తన గ్లామర్ తో అట్రాక్ట్ చేసింది. తొలిచిత్రమే అయినా నటనపరంగా తగినంత హోమ్ వర్క్ చేసినట్టు కనిపిస్తుంది. దీపాషా, ఐటి కంపెనీ టీమ్ లీడర్ పాత్రలో కృష్ణుడు ఫరవాలేదనిపించుకుంటారు. ఊహించని విధంగా ఒక సన్నివేశంలో జగపతిబాబు, డాన్స్ కాంపటీషన్ జడ్జిగా తరుణ్ మాస్టర్ గెస్ట్ పాత్రల్లో కనిపించారు.
Be first to comment on this News / Article!
Pages: -1- 2 -3-
|