'అమరావతి' రివ్యూ
దర్శకుడు రవిబాబు సినిమా ప్రథమార్థంలో చిన్నారి అమ్ములు అలియాస్ అమరావతిని చూపించి ద్వితీయార్థం వరకూ ఆ పాత్ర జోలికి వెళ్లకుండా సస్పెన్స్ క్రియేట్ చేశారు. అయితే ఒకసారి సస్పెన్స్ విప్పడం మొదలుపెట్టిన తర్వాత జరగబోయే సన్నివేశాలు ప్రేక్షకులు తేలిగ్గానే ఊహించ గలుగుతారు. హీరోయిన్ కు పది అంకె ఇష్టమన్నట్టు చూపించి శిశువులు అదృశ్యానికీ ఆ అంకెకూ ముడిపెట్టి చివరకు గర్భవతి అయిన ఇన్పెస్టిగేటింగ్ అధికారి భార్య వంతు వచ్చినట్టు చూపించడం థ్రిల్ కలిగిస్తుంది. ముఖ్యంగా 'హిప్నటిజం' అనే అంశాన్ని దర్శకుడు కథకు అన్వయించిన తీరు, మర్టర్ మిస్టరీలు ఛేదించడానికి అది ఉపకరించిన వైనం కొత్తగా ఉంది. హిప్నసిస్...పై ఉన్న అపోహలలో చివర్లో ఓ ఫ్యామస్ డాక్టర్ చేత వివరణ ఇప్పించారు కూడా.
రవిబాబు ఇన్వెస్టిగేటింగ్ అధికారిగా తన పాత్రను రక్తికట్టించారు. ఆయన పాత్రలో కొద్ది పాటి రొమాంటిక్ ఎలిమెంట్స్, కామెడీ టచ్ కూడా ఉంది. అతని భార్య లత పాత్రలో స్నేహ ఫరవాలేదనిపించుకుంటుంది. నిజానికి ఈ ఇద్దరి జోడీ విచిత్రంగానే అనిపించినా ఇద్దరి మధ్యా నడిచే ఓ రొమాంటిక్ సన్నివేశానికి ప్రేక్షకుల నుంచి కొద్దిపాటి రియాక్షన్ వస్తుంది. అమరావతి గా నటించిన భూమిక పాత్రలో తగినంత డెప్త్ లేదు. నవ్వుతూ ఒకటి రెండు సందర్భాల్లో కనిపించి ఆ తర్వాత పిచ్చిపట్టడం, చిన్నప్పటి భూమిక పాత్రకు ఉన్న ప్రాధాన్యం పెరిగి పెద్దయిన తర్వాత అంతగా లేకపోవడంతో ఆ పాత్రకు భూమిక చేయగలిగిన న్యాయం కూడా ఏమీ లేకపోయింది. హీరోగా సక్సెస్ లకు నోచని తారకరత్న ఇందులో తొలిసారి నెగిటివ్ పాత్రలో చేయడం సహజంగానే ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని నింపింది. నటించడానికి ఎక్కువ స్కోప్ ఉన్న పాత్రే అయినా తారకరత్నలో హావభావాల లోపం కొట్చొచ్చినట్టు కనిపిస్తుంది. ఎక్కువ భాగం 'మాస్క్'లోనే ఉండిపోయారు. అయితే హీరో పాత్రలు చేసినప్పటి కంటే ఇప్పుడే ఆయన ఎక్కువ కష్టపడినట్టు అనిపించక మానదు. నటుడిగా మరింత రాటుతేలక తప్పదు. రవిబాబు కొలీగ్ టాస్క్ ఫోర్స్ పోలీస్ గా గద్దె సింధూర క్యూట్ గా ఉంది. అయితే ఎప్పుడూ గన్ పట్టుకుని యాక్షన్ మూడ్ లో ఉండటం మినహా నటించడానికి పెద్దగా స్కోప్ లేదు. కోట శ్రీనివాసరావు, పరుచూరి గోపాలకృష్ణ గెస్ట్ పాత్రల్లో నటించారు.
Be first to comment on this News / Article!
Pages: -1- 2 -3-
|