'అమరావతి' రివ్యూ
సాంకేతికపరంగా సుధాకర్ రెడ్డి కెమెరా వర్క్, శేఖర్ చంద్ర బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమా థీమ్ కు వెన్నుదన్నుగా నిలిచాయి. పాటలకు చోటు లేదు. యతిరాజ్ సౌండ్ ఎఫెక్ట్స్ అదరగొట్టారు. లిఫ్ట్ నుంచి గర్భిణి బయటకు వచ్చినప్పుడు సర్..మంటూ కారు దూసుకువెళ్లడం, కోక్ డబ్బా గింగరాలు తిరగడం వంటి పలు సందర్భాల్లో సౌండ్ ఎఫెక్ట్ లు ప్రేక్షకులకు గుండె ఝల్లుమనిపిస్తాయి. ఆనంద్ ప్రసాద్ నిర్మాణ విలువుల కూడా తగినట్టుగానే ఉన్నాయి.
టైటిల్స్ కు ముందు సినిమా ఎత్తుగడ నుంచి విశ్రాంతి వరకూ సినిమా పట్టుగా నడిచింది. ద్వితీయార్థం మొదట్లో కొద్దిపాటి సాగతీత కనిపించినా ఆ తర్వాత కథ ట్రాక్ లోకి వచ్చి చివరి వరకూ పట్టుగా సాగింది. చిన్నపిల్లాడి పీక తెగకొట్టడం, ఆ పీక తొగ్గిట్టిన వ్యక్తే చివర్లో తన పీక కత్తిరించుకోవడం, హేమరేజ్ కారణంగా స్నేహకు బ్లీడింగ్ అయినట్టు చూపిన సన్నివేశం, గర్భాలను కోయడం వంటి సంఘటనలు జుగుప్స కలిగించక మానవు. అయితే ఇవన్నీ రవిబాబు మార్క్ అంశాలే కాబ్టటి...ఈ తరహా థ్రిల్లర్ చిత్రాలు ఇష్టపడే ప్రేక్షకులను 'అమరావతి' ఎంతమాత్రం నిరాశపరచదు. 'అనసూయ'తో పోల్చుకుంటే మాత్రం స్థాయి తక్కువే...
Be first to comment on this News / Article!
Pages: -1- -2- 3
|