'కాస్కో' రివ్యూ
ఆపదల్లో ఉన్న ప్రేయసి కోసం ప్రియుడు ఎన్నో కష్టాలు పడి చివరకు ఆమెను రక్షించడమనే ఫార్ములా పురాణాల కాలం నాటిది. ఇదే పాయింట్ తో వచ్చిన సినిమాలు కూడా లెక్కకు మిక్కిలాగానే ఉన్నాయి. ఫార్ములా పాతదే అయినా ప్రెజెంటేషన్ కొత్తగా ఉండేలా దర్శకుడు నాగేశ్వరరెడ్డి చూసుకుని ఉండాల్సింది. ఉదాహరణకు బ్రహ్మానందం, వైభవ్ లకు మహేష్ బాబు, పవన్ కల్యాణ్ పేర్లు పెట్టడంతోనే సరిపుచ్చుకున్నారు. ఆ హీరోలను ఇమిటేడ్ చేసే సన్నివేశాలు కొన్నైనా అల్లుకుని ఉంటే 'అష్టాచమ్మ'తరహాలో కొంతైనా నవ్వులు జనరేట్ అయ్యేవి. ఒక సందర్భంలో బ్రహ్మానందం, వైభవ్ లు ముఖానికి పెద్ద ఎన్టీఆర్, చిన్న ఎన్టీఆర్ మాస్క్ లు వేసుకుంటారు. కనీసం ఆ సందర్భంలోనైనా మహేష్ బాబు, పవన్ కల్యాణ్ మాస్క్ లను దర్శకుడు వేయించి ఉండొచ్చు. ఆ ఆలోచన ఎందుకు రాలేదో? అలాగే విశ్రాంతి కార్డు వరకూ అసలు కథలోకి ప్రేక్షకులను ఇన్వాల్వ్ చేయకపోవడం అనేది దర్శకుడి తాత్సారాన్ని తెలియజేస్తుంది.
వైభవ్ లో మంచి స్పార్క్ ఉంది. అయితే సరైన సినిమా పడాలి. 'ఒక్కసారి చూస్తే నచ్చకపోవచ్చు...చూడగా చూడగా నచ్చుతాను' అని వైభవ్ ఇందులో చెప్పిన డైలాగ్ ఆయన కెరీర్ కు అన్వయించుకోవచ్చు. ఫైట్స్ లో చక్కటి దేహదారుఢ్యంతోనూ, డాన్స్ లలో మంచి ఈజ్ తోనూ అలరించాడు. నటనకు సంబంధించిన మిగతా అంశాల్లోనూ ప్రతిభ చూపగలగితే మాస్ హీరోగా రాణించే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. శ్వేత బసు ప్రసాద్ గ్లామర్ ఈ చిత్రానికి ప్రధాన ఎస్సెట్. మోడ్రన్ కాస్ట్యూమ్స్ లో కనిపించి ఆడియెన్స్ ను చాలా సందర్భాల్లో రెప్పవేయనీయదు. ఇందులో తమాషాగా ఆమెను 'బండ జ్యోతి' అని హీరో పిలుస్తాడు. శ్వేతబసు ఆహార్యం కూడా ఇదేలా తయారవుతోంది. తగు జాగ్రత్తలు తీసుకోకుండా రేసులో వెనకబడటం తప్పదు. బ్రహ్మానందం పాత్ర నిడివి ఎక్కువే అయినా మహేష్ బాబు పేరుతో తగినన్ని నవ్వులు పంచలేకపోయారు. జయప్రకాష్ రెడ్డి కామెడీ విలన్ గా, అతని అసిస్టెంట్ గా రఘబాబు, ఓ రెండు సన్నివేశాల్లో ఎమ్మెస్ నారాయణ కొద్దిపాటి నవ్వులు పూయించారు. సెకెండాఫ్ లో విలన్ గా ప్రదీప్ రావత్ తన పాత్ర పరిధి మేరకు నటించారు.
Be first to comment on this News / Article!
Pages: -1- 2 -3-
|