'కాస్కో' రివ్యూ
సాంకేతికపరంగా ప్రేమ్ జీ సంగీతం అందించిన పాటల్లో 'నచ్చావే నచ్చాశావే', 'అమ్మాయి పేరు కృష్ణవేణి' పాటలు అలరిస్తాయి. వీటి చిత్రీకరణ కూడా బాగుంది. రవి సంభాషణల్లో పదును తక్కువ. పంచ్ లూ లోపించాయి. సెల్వ-గణేష్ కంపోజ్ చేసిన ఫైట్స్ మాస్ కు దగ్గరగా ఉన్నాయి. నిర్మాణ విలువలు కూడా తగినట్టుగానే ఉన్నాయి.
సినిమా ప్రథమార్థంలో సరైన విషయం లోపించింది. ద్వితీయార్థంలో వచ్చే ఫ్లాష్ ముగియగానే ఆ తర్వాత వచ్చే సన్నివేశాలు తేలిగ్గానే ఊహించేయ వచ్చు. దర్శకుడు ఇన్ని అడుగులకు ఓ పాట, ఓ ఫైట్ అనే విధంగా కమర్షియల్ ఫార్మెట్ లోనే సినిమాను నడిపారు. హీరోకి మాస్ ఇమేజ్ తెచ్చే క్రమంలో దర్శకుడు తనదైన కామెడీ మార్క్ ను నిలబెట్టుకోలేకపోయారు. నలిగిన పాయింట్ తో అంతకంటే బాగా నలిగిన బాటలోనే 'కాస్కో' నడక సాగింది. సొంత 'రిస్క్' మీద చూడొచ్చు...
Be first to comment on this News / Article!
Pages: -1- -2- 3
|