'సీతారాముల కళ్యాణం' రివ్యు
రామాయణంలోని పాత్రలను పోలిన పాత్రలను తెరపై ప్రెజెంట్ చేసేటప్పుడు స్క్రిప్టుపై దర్శకుడు మరింత పట్టుచూపించి ఉండాల్సింది. ఉదాహరణకు బ్రహ్మానందం పాత్రనే తీసుకుంటే ఆంజనేయుడు తరహా పాత్రగా చెప్పుకున్నారు. అయితే విలన్ కు బందీగా పడి ఉండే లాయర్ గా బ్రహ్మానందం ఇందులో కనిస్తాడు. చూసి రమ్మంటే కాల్చివచ్చేంత ప్రభుభక్తి పరాయణుడు ఆంజనేయుడు. ఇందులో మాత్రం హీరోకి బ్రహ్మానందం పెద్దగా సహకరించినట్టు క(అ)నిపించదు. చివర్లో ఆంజనేయుడు మూతి పెట్టడం మినహా. ఒకరంగా నితిన్ కు సహాయకుడు వచ్చిన ఆలీ ఒక సన్నివేశంలో ఆంజనేయుడుగా కనిపిస్తాడు. అతని భక్తుడుగానే బ్రహ్మానందం పాత్ర సాగుతుంది. పాత్రలకు సరైన క్లారిటీ లేకపోవడం అంటే ఇదే. నితిన్ సినిమాలన్నీ ఇటీవల కాలంలో మైండ్ గేమ్ చుట్టూనే నడుస్తున్నాయి. ఆ సినిమాలకు ఇది కూడా కంటిన్యుటీగానే దర్శకుడి ట్రీట్ మెంట్ సాగింది.
నితిన్ హ్యాండ్ సమ్ గా కనిపించడంతో పాటు అతను పడిన కష్టం స్క్రీన్ పై కనిపిస్తుంది. ముఖ్యంగా డాన్సులు విజృంభించి చేశాడు. ఎక్కువగా మోకాలి చిప్పలు, చేతి మడమలను ఉపయోగిస్తూ వేసిన స్టెప్ లు అతని కష్టానికి పరాకాష్ట. హన్సిక గ్లామర్ తళుకులీనింది. కొన్ని సీరియస్ సన్నివేశాల్లో ఆమె మంచి హావభావాలు ప్రదర్శించింది. బ్రహ్మానందానికి ఇది రొటీన్ తరహా పాత్రే. నిడివి కూడా ఎక్కువే అయినప్పటికీ ఆయన నుంచి వచ్చిన నవ్వులు కూడా తక్కువే. సునీల్ పాండా ఎక్కువగా అరుపులు..కేకలకే పరిమితమయ్యాడు. సుమన్ పూర్తిగా తన సత్తా చాటుకునే సన్నివేశాలు లేవు. జయప్రకాష్ రెడ్డి సీమ స్లాంగ్ కొట్టిన పిండే కావడంతో తన పాత్రకు న్యాయం చేశారు. ప్రిన్సిపాల్ రాంబోగా ఎమ్మెస్ నారాయణ, హీరో ఫ్రెండ్ గా ఆలీ తమ పాత్రలను సునాయాసంగా పోషించారు. విలన్ పాత్రల్లో కనిపించే సుబ్బరాజు తన ఇమేజ్ కు భిన్నంగా 'బుజ్జిగాడు మేడ్ ఇన్ భీమవరం' అంటూ సెకెండాఫ్ లో మంచి కామెడీ పండించారు. మిగిలిన పాత్రల గురించి పెద్దగా చెప్పుకోనవసరం లేదు.
Read 3 Comment(s) posted so far on this News / Article!
Pages: -1- 2 -3-
|