'సీతారాముల కళ్యాణం' రివ్యు
సాంకేతికపరంగా ఎం.జోషి సినిమాటోగ్రఫీ పనితనం ఆకట్టుకుటుంది. ముఖ్యంగా పాటల్లో. 'కిస్ మి' చిత్రీకరణ పరంగా బాగుంది. అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన పాటల్లో 'వెళ్లకే వెళ్లకే నన్నొదిలి వెళ్లకే' పాట యూత్ ఫుల్ గా, 'నా కళ్లలో నీవే కదా' మెలోడీ ప్రధానంగా ఆకట్టుకుంటుంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ షరామామూలే. తోట ప్రసాద్ సంభాషణలు సందర్భోచితంగానే ఉన్నాయి. 'అంబానీ ఐదొందల రూపాయలకే సెల్ ఇచ్చింది అమ్మాయిలతో ఆడుకోడానికి కాదు', 'నేను చెప్పేది నీ కర్రి చెల్లెలు గురించి కాదు...నీ కంత్రీ చెల్లె గురించి' (హన్సికను ఉద్దేశించి ఫ్రెండ్ తో నితిన్), 'పులి వేటాడి చంపాలనుకుంటుంది. ఈ పులికి ఆటా వచ్చా వేటా వచ్చు' (నితిన్) వంటి సంభాషణలు ఆకట్టుకుంటాయి. రామ్-లక్ష్మణ్ ఫైట్స్, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ ఓకే. మళ్ల విజయప్రసాద్ నిర్మాణ విలువలు కూడా తగినట్టుగానే ఉన్నాయి.
సినిమా ప్రథమార్థం లవ్, కామెడీ, ఫైట్స్ వంటి అంశాలతో బాగా నలిగిన రొటీన్ పంథాలో నడిస్తే...ద్వితీయార్థం దీనికి కొనసాగింపే. అయితే సెకెండాఫ్ లో వచ్చే కామెడీ కొంతవరకూ రిలీఫ్. హన్సిక మెరుపులు, కామెడీ ట్రాక్ మినహా 'సీతారాముల కల్యాణం' నడక తగినంత ఎగ్జయిట్ మెంట్ ఇవ్వదు. బాక్సాఫీస్ స్టామినా బలహీనమే...
Read 3 Comment(s) posted so far on this News / Article!
Pages: -1- -2- 3
|