విజయవాడ : కృష్ణాజిల్లా కలిదిండి డిప్యూటీ తాసిల్దార్ లతీఫ్ భాషా ఐదువేల రూపాయలు లంచం తీసుకుంటూ శుక్రవారం ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. ఓ రేషన్ షాపు వద్ద అయిదువేల రూపాయలు తీసుకుంటూ ఆయన అవినీతి నిరోధక శాఖ అధికారులకు దొరికిపోయారు. అధికారులకు దొరికిన వెంటనే ఆయన తప్పించుకున్నారు. దాంతో పోలీసులు లతీఫ్ భాషా కోసం గాలింపు చర్యలు చేపట్టారు.