విజయవాడ : ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ డిప్యూటీ రిజిస్ట్రార్ జీ కనకయ్య చౌదరి ఆయన ఛాంబర్ లో మృతి చెందటంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తన ఛాంబర్ లో తలకు గాయమై మృతి చెందిన ఆయన్ని శనివారం సిబ్బంది గుర్తించారు. వర్శిటీ కి శుక్రవారం సెలవు దినం అయినప్పటికీ ఆయన యూనివర్శిటీ ఛాంబర్ లో మరణించి ఉండడంతో పలు అనుమానాలకు తావిస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదుచేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు.