వడగండ్ల వాన
కడప : రాయచోటి ప్రాంతంలో వడగండ్ల వాన పడడంతో నేతాజీ సర్కిల్ వద్ద ఒక హోటల్ పూర్తిగా కొట్టుకుపోయింది. బస్టాండ్ రోడ్డులోని విద్యుత్ లైను కూలిపోయింది. దీంతో ఆ ప్రాంతంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అనేక చెట్లు, రేకుల షెడ్లు, విద్యుత్ స్తంభాలు ఒరిగిపోవడంతో ఆ ప్రాంత వాసులు భయాందోళనలకు గురౌవుతున్నారు. రోడ్ల పై ప్రవహించే వర్షపు నీరు ఇళ్ళల్లో ప్రవహించడంతో ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
News Posted: 22 May, 2009
|