కడప : జిల్లాలో కాంట్రాక్టు పద్ధతిపై భర్తీ చేయనున్న కండక్టర్ల పోస్టులకు విశేష స్పందన లభిస్తోంది. వారం రోజుల క్రితం ఇంటర్యూలకు హాజరైనవారిలో ఎంసీఏ విద్యార్థి సైతం ఉండడంతో అధికారులు అవాక్కయ్యారు. కాని కండక్టర్ పోస్టుకు 10వ తరగతి విద్యార్హత పెట్టడంతో వారు అదనపు విద్యార్హతలను పరిగణలోకి తీసుకోలేదు. జిల్లా వ్యాప్తంగా 738 కాంట్రాక్టు కండక్టర్ల పోస్టులకు 85 శాతం అభ్యర్థులు హాజరయ్యారు. ఈ పోస్టులకు అధిక సంఖ్యలో మహిళలు హాజరవడం విశేషం. వారం రోజుల క్రితం ప్రారంభమైన ఈ ఇంటర్యూలు నేటితో ముగియనున్నాయి. కండక్టర్ల పోస్టులను రెగ్యులర్ చేయనుండడంతో చాలామంది ఈపోస్టుల వైపు దృష్టిసారించారు.