బస్సు కిందపడి చిన్నారి మృతి
కరీంనగర్ : ముక్కుపచ్చలారని చిన్నారి ఓ స్కూల్ బస్సుకింద పడి చనిపోయింది. గోపాల్ పురంలో మంగళవారం ఓ స్కూల్ బస్సు కింద పడి పద్దెనిమిది నెలల పాప మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. కన్నబిడ్డ మృతి చెందడంతో ఆగ్రహించిన పాప తల్లితండ్రులు, బంధువులు ఆందోళనకు దిగారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని బస్సు డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు.
News Posted: 30 June, 2009
|