25, 26 తేదీల్లో ఏబీవీపీ సమావేశం
కడప : సుబ్బిరెడ్డి మెమోరియల్ జూనియర్ కళాశాలలో రెండు రోజుల పాటు ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరుగుతుందని ఏబీవీపీ జిల్లా కన్వీనర్ సురేష్ తెలిపారు. ఏబీవీపీ ఏర్పడి 60 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు కానున్న ఈ సమావేశానికి రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ఏబీవీపీ ప్రతినిధులు, పరిషత్ రాష్ట్ర ప్రధానాధికారులు, జాతీయ కార్యవర్గ సభ్యులు హాజరుకానున్నారు. ఈ సమావేశంలో ఏబీవీపీ సాధించిన విజయాలు, రానున్న రోజుల్లో నిర్వహించే పాత్ర పై ప్రత్యేక ఉపన్యాసాలుంటాయన్నారు. జిల్లాలోని ఏబీవీపీ కార్యక్రతలు, నాయకులు తప్పక హాజరు కావాలని ఆయన కోరారు. స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సామావేశంలో సురేష్ రెడ్డి పై వివరాలను తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర నాయకులు లక్ష్మణ్, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
News Posted: 24 July, 2009
|