కోస్ట్ గార్డ్ సేవలు మరింత విస్తృతం
కాకినాడ : కాకినాడ డీప్ వాటర్ పోర్ట్ లో 40 మీటర్ల వెడల్పుతో కోస్ట్ గార్డ్ బెర్త్ ను కేంద్ర రక్షణశాఖ సహాయమంత్రి పళ్లంరాజు శుక్రవారం ప్రారంభించారు. కృష్ణా గోదావరి బేసిన్ లో ఆయిల్ నిక్షేపాల అన్వేషణ, వెలికితీత కార్యకలాపాలు ముమ్మరమైన నేపథ్యంలో మూడేళ్ళ కిందట రాష్ట్రంలోనే ప్రపధమంగా కాకినాడలో ఇండియన్ కోస్ట్ గార్డ్ స్టేషన్ ను నెలకొల్పారు. కోస్ట్ గార్డ్ బెర్తు ప్రారంభంతో తీర ప్రాంత రక్షణలో కోస్ట్ గార్డు సేవలు మంరిత విస్తృతం కానున్నాయి. కాగా కోస్ట్ గార్డ్ సిబ్బంది నిర్లక్ష్యంపై పళ్లంరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. సముద్రంలో సీ సైలింగ్ ను ఆయన బహిష్కరించారు.
News Posted: 18 September, 2009
|