రాజ్యాంగ నిర్మాతకు నివాళి
నెల్లూరు : డా.బీఆర్.అంబేద్కర్ 53వ వర్ధంతి సందర్భంగా నెల్లూరులోని అంబేద్కర్ భవన్ లో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఇంటెలిజెన్స్ ఐజి పట్టపు రవి మాట్లాడుతూ మహిళ అభ్యున్నతకి డాక్టర్.బిఆర్ అంబేద్కర్ చేసిన కృషి మరువలేనిదన్నారు. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ శ్రమించాలని కోరారు. అంబేద్కర్ భవన్ లో ఆదివారం నిర్వహించిన అంబేద్కర్ వర్దంతి సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సభ్యులు అరవపూర్ణ ప్రకాష్, ప్రసాదరావు, స్వర్ణా నర్సారావు తదితరులు పాల్గొన్నారు.
News Posted: 7 December, 2009
|