కర్నూలు : అదుర్స్ సినిమాను అడ్డుకోవాలన్న కేసీఆర్ కుమార్తెను వెంటనే అరెస్ట్ చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే టీజీ వెంకటేశ్ డిమాండ్ చేసారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ నేతలు విద్యార్థులను బొమ్మల మాదిరిగా ఆడిస్తున్నారని ఆయన మండిపడ్డారు. సమైక్యవాదులు తీసిన సినిమా కాబట్టే అదుర్స్ సినిమా విడుదలను అడ్డుకుంటామన్న కవితపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేసారు.