కడప : సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ కడప జిల్లాలో పర్యటించనున్నారు. శుక్రవారం లేదా శనివారం ఆయన పర్యటన ఖరారయ్యే ఆవకాశాలున్నట్లు ఆయన అభిమాన వర్గాలు తెలిపాయి. హైదరాబాద్ నుండి హెలికాప్టర్ లో రిమ్స్ లో దిగి అదుర్స్ చిత్రం నడుస్తున్న రవి థియేటర్ లో ప్రేక్షకులను కలుసుకుంటారని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఆ తర్వాత జూనియర్ కర్నూలు జిల్లా పర్యటనకు వెళతారు.