నెల్లూరు : జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసుగా ఈ దామోదరం బాధ్యతలు స్వీకరించారు. కుటుంబ సమేతంగా ఆయన తిరుమలలో శ్రీవారిని దర్శనం చేసుకుని నెల్లూరుకు విచ్చేసారు. కడపకు బదిలీ అయిన ఎస్పీ మల్లారెడ్డి సమక్షంలో కొత్త ఎస్పీ దామోదరం బాధ్యతలు చేపట్టారు. నెల్లూరులో శాంతిభత్రలు పెంపొందించేందుకు విధులు నిర్వహిస్తుండటం తన అదృష్టమని ఆయన పేర్కొన్నారు.