'మిత్రుడు' రివ్యూ
విజయేంద్ర ప్రసాద్ కథల్లో సహజంగానే కొంత పాతదనం కనిపించినా ఆయా కథలకు దర్శకులు ఇచ్చిన ట్రీట్ మెంట్ కొత్తగా ఉండి పలు చిత్రాలు హిట్టయిన దాఖలాలున్నాయి. దర్శకుడు మహాదేవ్ ఈ చిత్రం విషయంలోనూ అలాంటి ప్రయత్నమే చేశారు. మలేసియా బ్యాక్ డ్రాప్ 'పోష్ లక్' తేస్తే, గోదావరి ప్రాంతాల నేపథ్యం నేటివిటికీ దగ్గర చేశారు. సింహలగ్న జాతకుడంటూ బాలకృష్ణను ఇంట్రడ్యూస్ చేసి..ఆ తదుపరి సన్నివేశమే రెయిలింగ్ మీద బాలకృష్ణతో ఓ ఫీట్ చేయించడం ద్వారా ఆయన పాత్రకు మొదట్నించీ ప్రేక్షకుల కోణం నుంచి కొత్తగా చూపించే ప్రయత్నం చేశారు. బాలకృష్ణ చేత దూకుడు సంభాషణలు కాకుండా ఆచితూచి సంభాషణలు చెప్పించడం కూడా ఇందులో స్పష్టంగా కనిపిస్తుంది. కారు యాక్సిటెంట్ సన్నివేశాన్ని ఫ్లాష్ బ్యాక్ లో రిపీట్ చేసి...అప్పుడు జరిగిన భారీ ప్రమాద సంఘటనను దర్శకుడు బాగా రక్తి కట్టించారు. అలాగే శిథిలాల కింద ఉన్న మృతదేహాలను చూసి బాలకృష్ణ చలించినపోయిన ఘట్టం కూడా దర్శకుడు బాగా హ్యాండిల్ చేశారు. జ్యోతిష్యుడు చేత చివర్లో చెప్పించిన 'లాజిక్' అతికినట్టు అనిపించపోయినా ఆ పాయింట్ ను విడిచిపెట్టకపోవడం దర్శకుడికి స్క్రిప్టుపై ఉన్న పట్టును తెలియజేస్తుంది.
బాలకృష్ణ గత సినిమాలతో పోలిస్తే ఇందులో అందంగా, తగినంత స్టయిల్ తో కనిపించడం విశేషం. అవసరమైన సందర్భాల్లో రౌద్రరసాన్ని పలికిస్తూనే, ఎమోషన్, సెంటిమెంట్, లవ్ వంటి అంశాలన్నింటీనీ సమర్ధవంతగా హ్యాండిల్ చేశారని చెప్పవచ్చు. ప్రియమణి తన గ్లామర్ ను మరింత పదునుపెట్టింది. టవల్ జార్చే సన్నివేశం 'క్లాస్'కు ఒకింత ఇబ్బందే. నటనపరంగా ఫరవాలేదు. ప్రియమణి మామయ్య జె.పి.జెన్ (జానా బెత్తా జనార్థన్)గా బ్రహ్మానందం, మరో పాత్రలో కృష్ణ భగవాన్, ప్రియమణి ఫ్రెండ్ టక్కాలిగా నటించిన అమ్మాయి కథలో భాగంగా కామెడీ పండించారు. రంగనాథ్, విలనీ పాత్రలో ప్రదీప్ రావత్ తమ పాత్రలకు అనుగుణంగా నటించారు. చంద్రమోహన్ పాత్రకు విలనీ టచ్ ఇవ్వడం బాగుంది. బాలయ్య, రాళ్లపల్లి, ధర్మవరపు వంటి సీనియర్ నటులు కూడా చిన్న చిన్న పాత్రల్లో నటించారు.
Read 3 Comment(s) posted so far on this News / Article!
Pages: -1- -2- 3 -4-
|