'మిత్రుడు' రివ్యూ
సాంకేతికతపరంగా బాలమురుగన్ సినిమాటోగ్రఫీ సినిమాకి రిచ్ నెస్ తెచ్చిందని చెప్పవచ్చు. మలేసియా అందాలను చక్కగా తెరకెక్కించారు. మణిశర్మ సంగీతం సమకూర్చిన పాట్ల్లో 'ప్రియమణీ అన్నాను నిన్నెప్పుడో' అనే పాట రిపీట్ గా వినాలిపించేలా ఉంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ యాప్ట్ గా ఉంది. రమా రాజమౌళి కాస్ట్యూమ్స్ డిజైనింగ్ ఆకట్టుకుంటుంది. ఎం.రత్నం సంభాషణలు యావరేజ్ రేంజ్.
'అన్నీ కావాలనుకునే వాళ్లకు చావంటే భయం...అన్నీ వదులుకున్నవాడికి బ్రతుకంటే భయం', 'నేను ఏదీ ఆలోచించే చేయను' వంటి సంభాషణలకు ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ వస్తోంది. మాస్ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని కొన్ని ద్వంద్వార్థ సంభాషణలు కూడా రాశారు.
రామ్-లక్ష్మణ్ ఫైట్స్, కోలా భాస్కర్ ఎడిటింగ్ ఓకే. నిర్మాణ విలువల విషయంలో శివలెంక కృష్ణ ప్రసాద్ ఎక్కడా రాజీపడలేదు.
సినిమా ప్రథమార్థం యాక్షన్, కామెడీ, కొద్దిపాటి రొమాంటింక్ టచ్ తో ఆకట్టుకుంటుంది. ద్వితీయార్థంలో సెంటిమెంట్, యాక్షన్ కు పెద్దపీట వేశారు. చివర్లో వచ్చే హీరో ఫ్యాష్ బ్యాక్ ఎపిసోడ్ ఆకట్టుకుంటుంది. క్లైమాక్స్ రొటీన్ కు భిన్నమని చెప్పలేము కానీ తగినట్టుగానే ఉంది. బాలకృష్ణ ఫ్రెష్ లుక్, ప్రియమణి గ్లామర్, కథలో అంతర్లీనమైన కామెడీ, దర్శకుడు మహాదేవ్ కథను నడిపించిన తీరు 'మిత్రుడు'కు కలిసొచ్చే అంశాలు. 'అరుంధతి' మినహా ఇంతవరకూ సరైన హిట్లు లేని పరిస్థితిలో విడుదలైన పెద్దహీరో సినిమా కావడం బోనస్. విస్తృత ఎన్నికల ప్రచారం తర్వాత బాలకృష్ణను వెండితెరపై చూడటం అభిమానులకు సైతం థ్రిల్ కలిగించొచ్చు. ఓవరాల్ గా...బాలకృష్ణకు 'మిత్రుడు' కమ్ బ్యాక్ సినిమా అయ్యే అవకాశాలు మాత్రం ఉన్నాయి.
Read 3 Comment(s) posted so far on this News / Article!
Pages: -1- -2- -3- 4
|