'వీడొక్కడే' రివ్యూ
ఎవిఎం సంస్థ విజయ రహస్యం ఆ సంస్థ నమ్మిన సిద్ధాంతంలోనే కనిపిస్తుంది. 'ఎఫర్ట్స్ నెవర్ ఫెయిల్' అన్నదే ఆ సంస్థ మోటో. అందుకు నిదర్శనమే ఆ సంస్థ నుంచి 174వ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'వీడొక్కడే'. అరవై ఏళ్లగా పైగా ఆ సంస్థ మనుగడకు...ఎంచుకునే ఇతివృత్తాలు, నిర్మాణ విలువలు, ప్రెజెంటేషన్ కారణాలనడానికి సందేహం అక్కర్లేదు.ఆ బ్యానర్ విలువను 'వీడొక్కడే' నిలబడుతుంది. కథ రొటీన్ స్మగ్లింగ్ నేపథ్యమే అయినా...చాలా రియలస్టిక్ గా, స్క్రీన్ ప్లే ప్రధానంగా ఈ చిత్రాన్ని దర్శకుడు కె.వి.ఆనంద్ తెరకెక్కించిన తీరు అబ్బుర పరుస్తుంది. స్లగ్లింగ్, నైతిక విలువలతో పాటు ఫ్రెండ్ షిప్, లవ్ వంటివి కథలో అంతర్లీనంగా జొప్పించడం ద్వారా కమర్షియల్ ఇన్ గ్రీడియంట్స్ కు లోపం లేకుండా చూసుకోవడం దర్శకుడి ముందుచూపునకు నిదర్శనం. హీరో సూర్య తెలుగు సర్క్యుట్స్ లోనూ అడపాదడపా వేవ్స్ సృష్టిస్తూనే ఉన్నారు. ఇంతవరకూ ఆయన నటించిన స్ట్రయిట్ తెలుగు చిత్రమేదీ ప్రేక్షకుల ముందుకు రాకపోయినా 'గజనీ' ఛార్మ్ అలాగే పదిలంగా ఉంది. 'సూర్య సన్నాఫ్ కృష్ణన్' ఓపినింగ్స్ కు కూడా ఇదే కారణం. 50కి పైగా ప్రింట్లతో ఒక తెలుగు స్ట్రయిట్ సినిమా లాగా 'వీడొక్కడే' చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఏవియం సంస్థ సురేష్ సంస్థ భాగస్వామ్యంతో సినిమాను విడుదల చేయడం కూడా ఈ చిత్రంపై అంచనాలు పెంచింది. ఆ ఆంచనాలను ఏమేరకు 'వీడొక్కడే' నిలబెట్టాడనేది చూద్దాం.
దేవా (సూర్య) పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తాడు. తల్లి మినహా తండ్రి లేని దేవాకు దాస్ (ప్రభు) అంటే ప్రాణం. ఒకప్పుడు దాస్, దేవా తండ్రి కలిసి పనిచేయడం ఇందుకు ఓ కారణం. దాస్ ఓ స్మగ్లర్. దేవా అతని దగ్గర కొరియర్ గా పనిచేస్తుంటాడు. దాస్, దేవా టీమ్ ఆఫ్రికా నుంచి వజ్రాలు తెచ్చి స్మగుల్ బిజినెస్ చేస్తుండటం, అన్నింట్లోనూ నెంబర్ వన్ అనిపించుకుంటూ ఉండటం ఆ ఇద్దరికీ ప్రత్యర్థి అయిన మరో స్మగ్లర్ కమలేష్ (ఆకాష్ దీప్) సహించలేకపోతుంటాడు. ఎలాగైనా దాస్ ముఠాను దెబ్బకొట్టాలని పన్నాగాలు పన్నుతుంటాడు. ఈ క్రమంలో పైరసీ వీడియో వ్యవహారంలో దాస్ కు బదులు చిట్టి (జగన్) అనే వ్యక్తి జైలుకు వెళ్లి..తిరిగొచ్చిన తర్వాత ఆ ముఠాకు దగ్గరవుతాడు. దేవా, చిట్టి మంచి స్నేహితులవుతారు. చిట్టి చెల్లెలు యమున (తమన్నా)తో దేవా ప్రేమలో పడతాడు. ఈ క్రమంలో ఊహించని విధంగా చిట్టి, దాస్ ప్రాణాలు కోల్పోతారు. ఇందుకు కారకులెవరు? కమలేష్ నెంబర్ వన్ డాన్ కావలనే ప్రయత్నాలను దేవా ఎలా అడ్డుకున్నాడు? చివరకు స్మగ్లింగ్ ఉచ్చు నుంచి దేవా ఎలా బయటపడ్డాడనేది మిగతా కథ.
Be first to comment on this News / Article!
Pages: 1 -2- -3-
|