'కిక్' రివ్యూ
కమర్షియల్ సినిమా ఫార్ములా చాలా సందర్భాల్లో మాస్ పల్స్ ను బట్టే ఉంటుంది. వినోద ప్రదాన మాధ్యమం సినిమా కావడంతో రొటీన్ కు భిన్నంగా ఏమి చెప్పినా ప్రేక్షకులు పట్టం కడతారు. ప్రేక్షకులకు నచ్చిందే ఆ తర్వాత ఫార్ములా అయి కూర్చుంటుంది. ప్రతి చెడుపని వెనుక ఓ మంచి ఉంటుందని చెప్పే కథాంశాలు రాబిన్ హుడ్ కాలం నుంచి జనానికి సుపరిచితమే. 'జంటిల్ మెన్'...'ధూమ్ -2'...ఇంకా ఎన్నో దొంగాపోలీసు డ్రామాతో వచ్చిన వచ్చిన సినిమాలన్నీఈ లైన్స్ నుంచి అల్లుకున్నవే. 'కిక్' సైతం ఇదే కోవలోకి వస్తుంది. కాకుంటే ఈసారి యాక్షన్ కంటే పూర్తిగా ఎంటర్ టైన్ మెంట్ కే ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా 'కిక్'ను 'మాస్'కు దగ్గర చేర్చే ప్రయత్నం దర్శకుడు సురేందర్ రెడ్డి చేయడం కనిపిస్తుంది. మొదట్నించీ రెవేంజ్ స్టోరీలతోనే సినిమాలు తీస్తూ వస్తున్న సురేందర్ రెడ్డి బాణీ మార్చి కామెడీ వైపు నుంచి కథను సాఫీగా నడిపించుకుపోయారు. ఇదే సమయంలో లాజిక్ లు పట్టించుకోలేదు. 'కిక్' అనే మాటలను పదేపదే వల్లెవేయించడం, 'నౌ ది స్టోరీ స్టార్' అని సెకెండాఫ్ నుంచి కీలక పాత్రధారులందిరితోనూ చెప్పించడంలోనూ ప్రేక్షకుడ్ని చివరివరకూ కుర్చీల్లో కట్టిపడేయాలనే తపనే కనిపిస్తుంది. నిజంగా ప్రేక్షకుడికి అలాంటి కిక్ దొరికినట్టేనా అనేది ఓసారి చూద్దాం...
కల్యాణ్ (రవితేజ) చదవు, తెలివితేటలు పుష్కలంగా ఉన్న చురుకైన యువకుడు. ఏ పని చేసినా అందులో ఓ 'కిక్ ' ఉండాల్సిందేనని తెగేసి చెబుతుంటాడు. కిక్ పోయిందంటూ ఏ ఉద్యోగంలోనూ పట్టుమని నాలుగు రోజులు కూడా ఉండడు. ఒకరోజు నైన (ఇలియానా) అనే అందమైన అమ్మాయి కల్యాణ్ కు పరిచయమవుతుంది. వెంటనే ప్రేమలో పడిపోతాడు. తనను ప్రేమించమంటూ ఆమె చుట్టూ తిరుగుతుంటాడు. తాను ప్రేమంచాలంటే ఏదో ఒక ఉద్యోగంలో సెటిల్ కమ్మని నైన షరతు పెడుతుంది. ఆమె కోసం ఓ ఉద్యోగంలో చేరుతాడు. తన ప్రేమను అతనితో చెప్పాలని నిశ్చయించుకున్న సమయంలో అతను ఆ జాబ్ వదిలేసాడనే విషయం తెలుస్తుంది. దాంతో ఇద్దరి మధ్యా మాటామాటా పెరిగి చివరకు విడిపోతారు. కట్ చేస్తే...నైన మలేసియా వెళ్తుంది. నైన తల్లిదండ్రులు ఆమెకు ఓ పోలీస్ ఆఫీసర్ కల్యాణ్ కృష్ణ (శ్యామ్)తో పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తారు. అందుకోసం కృష్ణ మలేసియా వచ్చి నైనను కలుసుకుంటాడు. కృష్ణ అక్కడకు రావడానికి మరో ప్రధాన కారణం ఉంది. చట్టం కళ్లు గప్పి 150 కోట్లకు పైగా దోపిడీ చేసిన ఓ తెలివైన దొంగను పట్టుకునే బాధ్యత అతనిపై ఉంటుంది. ఆ దొంగ మరెవరో కాదు...కల్యాణ్. అసలు కల్యాణ్ దొంగగా ఎందుకు మారాల్సి వచ్చింది? అతను మలేసియా ఎందుకు వచ్చాడు? దొంగాపోలీసు ఆటలో చివరికి గెలుపెవరిది? కల్యాణ్-నైనల ప్రేమకథ ఎలా ముగిసిందనేది మిగతా కథ.
Be first to comment on this News / Article!
Pages: 1 -2- -3-
|