'ప్రయాణం' రివ్యూ
రెండు పాత్రలతో 'షో' చూపిస్తే జాతీయ స్థాయి గుర్తింపు వచ్చింది. అప్పట్లో అదో వైవిధ్యం. కేవలం రెండు గంటల్లో ప్రేమ పుట్టి...మొగ్గతొడిగి...పువ్వు పూస్తే ఎలా ఉంటుంది? నిజానికి ఇలాంటి ఆలోచనకు కార్యరూపం ఇవ్వడం సాహసమే. 'లవ్ ఎట్ ఫస్ట్ సైట్' మీద నమ్మకం ఉన్న వాళ్లు సైతం 'డెడ్ లైన్' గీసుకుని ప్రేమను సాఫల్యం చేసుకున్నట్టు ఎక్కడా కనబడదు. అయితే రొటీన్ కు భిన్నంగా ఏది చేసినా అది ఓ ప్రయోగమే అవుతుంది. 'ఐతే', 'అనుకోకుండా ఒకరోజు', 'ఒక్కడున్నాడు' వంటి వైవిధ్యమైన చిత్రాలు తీసిన చంద్రశేఖర్ యేలేటి ఇప్పుడు అలాంటి సాహసయానమే చేశారు. కేవలం ఆరేడు పాత్రలతో ప్రేక్షకులను రెండు గంటల ప్రేమ 'ప్రయాణం' చేయించారు. చూపులు కలవడం, ప్రేమలో పడటం, ప్రపోస్ చేయడం, లవ్ క్వశ్చనీర్, ఫైనల్స్ ...ఈ సంఘటనలన్నింటికీ నేపథ్యం కౌలాలంపూర్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్. నిజానికి ఇవాల్టి కమర్షియల్ ట్రెండ్ కు భిన్నమైన ప్రయత్నం ఇది. ఇలాంటి థీమ్ తో రిస్క్ చేయడానికి నిర్మాతలు సాహసించరని గ్రహించడం వల్లనో ఏమో...చంద్రశేఖర్ యేలిటి నిర్మాతగా మారి ఆర్యకి ఆర్ట్స్ బ్యానర్ నుంచి ఈ చిత్రానికి కర్త, కర్మ, క్రియ అంతా తానే అయ్యారు. ఆయన 'ప్రయాణం'లోని పదనిసల్లోకి తొంగిచూస్తే...
Be first to comment on this News / Article!
Pages: 1 -2- -3-
|