'రైడ్' రివ్యూ
బైక్ పోవడమనే చిన్న పాయింట్ తో రెండున్నర గంటల సేపు ప్రేక్షకులను కూర్చోబెట్టడమంటే దర్శకుడికి చాలా నేర్పు అవసరం. దర్శకుడే కథకుడు కావడం వల్లనేమో రమేష్ వర్మ ఎక్కడా తొట్రుపాటు పడినట్టు కనిపించదు. వేగం తగ్గిందనిపించినప్పుడల్లా కమర్షియల్ ఫార్మెట్ లోకి వెళ్లిపోయి ఓ రొమాంటిక్ లవ్ సీన్, వెంటనే ఓ స్పీడ్ డ్యూయెట్, మరో కామెడీ బిట్, ఇంకో సెంటిమెంట్ సీన్...ఇలా కథలో ఇన్ వాల్స్ చేసే ప్రయత్నం చేశారు. రిటైరైన తండ్రి బాధ్యతలు ఎరిగిన కొడుకు కాళ్లు పడుతూ...అన్నీ చూసుకునే నవ్వుండగా ఈ మందులు ఎందుకురా అంటూ వాటిని చెత్తబుట్టలో పడేసే సన్నివేశం హృద్యంగా అనిపిస్తుంది. అలాగే తన కంటే తన ఫ్రెండ్ బాగుని ఎక్కువగా కోరుకునే వాడే నిజమైన ఫ్రెండ్ అని చెప్పిన తీరూ కూడా సమర్ధనీయంగా ఉంది.
'అష్ట చమ్మా' చిత్రానికి భిన్నమైన పాత్రలో నాని రాణించారు. ఈసారి మాస్ తరహా పాత్ర రావడం కొత్త ఇమేజ్ కు దోహదం చేస్తుంది.
సంభాషణలు, ఫైట్స్ లో మంచి ఈజ్ కనబరచారు. డాన్స్ ల్లో కూడా ఓకే. తనీష్ లో ('నచ్చావులే' ఫేమ్) లేత ఛాయలు ఉండటంతో లవర్ బాయ్ గా మరిన్ని అవకాశాలు తథ్యం. కుటుంబ బాధ్యతలు, ప్రేమ విషయంలో కమిట్ మెంట్ ఉన్న యువకుడిగా తీనీష్ తన పాత్రకు న్యాయం చేశారు. ముఖ్యంగా రొమాంటిక్ సన్నివేశాలు, డాన్స్ లు బాగా చేశారు. సంభాషణలు పలకడం ఇంప్రూవ్ చేసుకోవాలి. అక్ష ('యువత' ఫేమ్) పాత్ర పరిధి తక్కువే అయినా ఉన్నంతలో ఫరవాలేదు. శ్వేతబసు ప్రసాద్ 'కొత్తబంగారులోకం' తర్వాత మళ్లీ యూత్ కు కిక్ ఇచ్చినట్టే. 'ఓరినాయనో...', 'ఎందు..కూ..' అనే సాగదీత సంభాషణలను మరోసారి ప్రేక్షకులు హ్యాపీగా రిసీప్ చేసుకుంటున్నారు. గ్లామర్ ప్రదర్శనలోనూ శ్వేత మంచి మార్కులు కొట్టేసింది. ఆహుతి ప్రసాద్, తనీష్ తండ్రిగా చేసిన నటుడు తమ పాత్రలకు చక్కటి న్యాయం చేశారు. తనీష్ తల్లిగా నటి తులసి చక్కగా మెప్పించింది. తనీష్ ఫ్రెండ్ గా చేసిన కొత్త కుర్రాడు చలాకీగా, స్పాంటేనిష్ డైలాగ్స్, ఎక్స్ ప్రిషన్స్ తో ఆకట్టుకుంటాడు. చిట్ ఫండ్స్ మేనేజర్ గా బ్రహ్మానందం, ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ గా ధర్మవరపు సుబ్రమణ్యం అడపాదడపా నవ్వించారు. బైక్ రైడింగ్ ఛాంపియన్ గా నవదీప్ అతిథి పాత్రలో కనిపించారు.
Be first to comment on this News / Article!
Pages: -1- -2- 3 -4-
|