'రైడ్' రివ్యూ
సంగీత దర్శకుడైన సింగర్ హేమచంద్ర తనకు వచ్చిన తొలి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. 'కొక్కొరోకే కోడి వచ్చినాదే', రీమిక్స్ 'దంచవే మేనత్త కూతురా' పాటలు యూత్ కు ఉత్సాహానిస్తాయి. చిన్నా బ్రౌక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమా థీమ్ కు బలం చేకూర్చేలా ఉంది. శ్యామ్ కె.నాయుడు సినిమాటోగ్రఫీ పనితనం ఆకట్టుకుంటుంది. శశాంక్ వెన్నెలకంటి సందర్భోచితమైన సంభాషణలు అందించారు. 'లైఫంటే లెక్కలు కాదు..పిల్లలని అర్ధమైంది' (ఆహుతి ప్రసాద్), 'బైక్ ఎక్కించుకున్న వాళ్లందర్నీ అన్నయ్య అంటున్నావుగా. మాకెందుకులే ఆ బంపర్ ఆఫర్' (అక్షతో నాని) వంటి పలు సంభాషణలు ఆకట్టుకుంటాయి. క్లైమాక్స్ లో వచ్చే బైక్ కాంటెస్ట్, బైక్ రైడింగ్ చేస్తున్న విలన్ తో హీరోలు తలపడే ఘట్టాలను రామ్-లక్ష్మణ్ బాగా కంపోజ్ చేశారు. మార్తాండ్ కె.వెంకటేష్ ఎడిటింగ్ పనితనం కనపిస్తుంది. 'వన్ ఫిల్మ్ ఓల్డ్' హీరోహీరోయిన్లను తీసుకుని ఎక్కడా నిర్మాణ విలువల విషయంలో రాజీపడని బెల్లంకొండ సురేష్ ను అభినందించవచ్చు.
సినిమా ప్రథమార్థం కామెడీ, ప్రేమ సన్నివేశాలు, కొద్దిపాటి యాక్షన్ తో నడుస్తుంది. సెకెండాఫ్ లో టెంపో పెరుగుతూ వచ్చింది. అక్కడక్కడా చిన్న పాటి జర్క్ లు వచ్చినా వెంటవెంటనే రైట్ ట్రాక్ లోకి కథను తెచ్చి ఎక్కగా వేగం తగ్గకుండా దర్శకుడు రమేష్ వర్మ పట్టు కనబరచారు. ఇద్దరు హీరోల మధ్య సమాతారంగా నడిచే క్లైమాక్స్ ఆకట్టుకుంటుంది. కొత్త ఫేసులు, కొత్తదనం ఉన్న కథ, సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణలు. ఓవరాల్ గా 'రైడ్'లో స్పీడ్ ఉంది. యువతరాన్ని మెప్పించగలిగే కిక్కూ ఉంది.
Be first to comment on this News / Article!
Pages: -1- -2- -3- 4
|