'కరెంట్' రివ్యూ
సుషాంత్ (సుషాంత్) ఇంజనీరింగ్ చదువుతుంటాడు. వర్తమానం మినహాయిస్తే భవిష్యత్తును ఏమాత్రం ఖాతరు చేయని వ్యక్తి. జీవితంలో ఏదీ సీరియస్ గా తీసుకోడనే ముద్ర వేయించుకుంటాడు. తన కాలేజీలోనే చేరిన ఓ జడ్జి (చరణ్ రాజ్) కూతురు స్నేహ (స్నేహ ఉల్లాల్ )ను తొలి చూపులోనే ప్రేమిస్తాడు. మొదట్లో తండ్రి చూపించిన ఓ ఫారెన్ సంబంధాన్ని ఒప్పుకున్న స్నేహ ఆ తర్వాత క్రమంలో సుషాంత్ ప్రేమలో పడుతుంది. తండ్రికి ఆ విషయం చెప్పడంతో సుషాంత్ ను ఒకసారి కలవాలని అంటాడు. సుశాంత్ వచ్చి ఆయనను కలుస్తాడు. జీవితంలో ఏ విషయాన్ని బాధ్యతగా తీసుకోని సుషాంత్ వైఖరి ఆయనకు నచ్చదు. ఇదే విషయాన్ని స్నేహకు వివరించి నిర్ణయం ఆమెకే వదులేస్తాడు. తన తండ్రి ఆశించినట్టు ఒక లక్ష్యం అంటూ ఉండటంలో తప్పులేదనీ, ఒకసారి ఆలోచించమనీ సుషాంత్ ను స్నేహ కోరుతుంది. ప్రేమించినప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడు ఎందుకని ప్రశ్నించిన సుషాంత్ తనను చేసుకుంటే కార్లు, బిల్డింగ్ లు ఇవ్వలేకపోయినా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానంటూ వాదనకు దిగుతాడు. ఇద్దరి మధ్యా అభిప్రాయ భేదాలు తలెత్తుతాయి. అయితే సుషాంత్ జ్ఞాపకాలను స్నేహ మరచిపోలేక పోతుంది. దీంతో ఒకరోజు సుషాంత్ ను కలిసి తనలో ప్రేమ పుట్టించిన అతనే ఆ ప్రేమను వెనక్కి తీసుకోవాలని అంటుంది. సుషాంత్ సరేనంటాడు. ఆ తర్వాత ఏమి జరిగింది? స్నేహ తన ప్రేమను అసహ్యించుకునే ప్రయత్నంలో అతను ఎంతవరకూ సక్సెస్ అయ్యాడు? వారి ప్రేమకథకు ముగింపు ఏమిటనేది మిగతా కథ.
Be first to comment on this News / Article!
Pages: -1- 2 -3- -4-
|