'కరెంట్' రివ్యూ
సాంకేతిక పరంగా దేవీశ్రీప్రసాద్ సంగీతం యూత్ కు దగ్గరగా ఉంది. అక్కడక్కడా పాత బాణీలు తొంగిచూసినా 'రొక్కలు తొడిగిన పక్షల్లే', 'యు ఆర్ మై లవ్ స్టోరీ', 'అమ్మాయిలు అబ్బాయిలూ కమాన్ కమాన్' పాటలు యూత్ కు పట్టేవే. ముగ్గురు సంభాషణా రచయితలు ఉన్నా తగిన పదను కనిపించదు. 'మంచి ఫ్రెండ్ కోచ్ లా ఉండాలి. మన బలహీనతలను చెప్పడమే కాకుండా మనను గెలిచేలా చేయగలడు' వంటి ఒకటి రెండు సంభాషణలు ఆకట్టుకుంటాయి. షకీలాతో చెప్పించిన సంభాషణల్లో నాటు పాళ్లెక్కువ. విజయ్ సి. కుమార్ సినిమాటోగ్రఫీ తగిన ప్రమాణాలతో ఉంది. నిర్మాణ విలువల విషయంలో చింతలపూడి శ్రీనివాసరావు, ఎ.నాగసుశీల ఎక్కడా రాజీ పడలేదు. సుషాంత్ కు తల్లి అయిన శ్రీమతి నాగసుశీల ఆయనకు కాస్ట్యూమ్స్ డిజైనర్ గా వ్యవహరించడం విశేషం.
సినిమా ప్రథమార్థం స్లోగా మొదలైనా విశ్రాంతి ట్విస్ట్ కొద్దిపాటి ఆసక్తిని రేకెత్తిస్తుంది. ద్వితీయార్థంలో కొన్ని ట్విస్ట్ లు ఉన్నప్పటికీ ఎమోషన్ సన్నివేశాల్లో డెప్త్ లోపించడంలో హీరోహీరోయిన్ల మధ్య 'ప్రేమ' వ్యవహారం ఎంతకూ పాకన పడదు. ఇందువల్ల ప్రేక్షకులు సీరియస్ గా కథలోకి ఇన్ వాల్స్ కాలేని పరిస్థితి ఏర్పడుతుంది. సుఖాంతమైన ముగింపు కావడం రిలీఫ్. ఏ సినిమా ఫేట్ అయినా ఇటీవలకాలంలో యూత్ ఆడియెన్స్ పైనే ఎక్కువగా ఉంటున్నందున 'కరెంట్' వ్యవహారమూ వారి చేతిల్లోనే ఉంది. తగినంత పబ్లిసిటీ దొరికేతే 'కరెంట్' పాసవుతుంది.
Be first to comment on this News / Article!
Pages: -1- -2- -3- 4
|