'కరెంట్' రివ్యూ
ప్రేమను వెనక్కి తీసుకోవడమే పాయింటే కొత్తగా అనిపించినా దానిని కన్విన్సింగ్ గా చెప్పడంలో దర్శకుడు పడిన కష్టం సరిపోదు. ఉదాహరణకు ప్రేమించిన అమ్మాయి తనను ద్వేషించాలంటే కథానాయకుడు తప్పతాగి చిందులు వేయడం, వేశ్యావాటికకు వెళ్లడం వంటివి 'ప్రేమాభిషేకం' కంటే ముందు నుంచీ జనం చూస్తున్నవే. అలాగే కొన్ని కీలక సన్నివేశాలు ఉన్నప్పటికీ ఆ తర్వాత సరైన కంటిన్యుటీ లేకపోవడమూ కనిపిస్తుంది.
సుశాంత్ డాన్స్ లు, ఫైట్స్ లో బాగా రాణించారు. అయితే హావభావాల విషయంలో బెటర్ మెంట్ కోసం ప్రయత్నించాల్సిన అవసరం ఉంది. స్నేహ ఉల్లాల్ గ్లామర్ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. కొన్ని సందర్భాల్లో ముఖంలో సరైన హావభావాలు పలకనప్పటికీ సినిమా మొత్తం క్యూట్ గా కనిపించి అలరిస్తుంది. సుశాంత్ ఫ్రెండ్ గా నటించిన వెన్నెల కిషోర్, స్నేహ ఫ్రెండ్ గా నటించిన అమ్మాయి మధ్య నడిచిన లవ్ ట్రాక్ కొద్దిపాటి హ్యూమర్ ను అందించింది. ఏరోనాటిక్ ఇంజనీరింగ్ ఇన్ స్ట్రక్టర్ గా బ్రహ్మానందం పాత్ర నిడివి తక్కువ కావడంతో ఆయన చేయగలిగేది కూడా ఏమీ లేకపోయింది. రఘుబాబు, షపీ కొద్దిపాటి హాస్యం అందించారు. తనికెళ్ల భరణి, చరణ్ రాజ్ తమ పాత్రలను సునాయాసంగా పోషించారు. షకీలా వేశ్యావాటిక నడిపే పాత్రలో కనిపించింది.
Be first to comment on this News / Article!
Pages: -1- -2- 3 -4-
|