'ఎవరైనా ఎపుడైనా' రివ్యూ
వజ్రోత్సవ సంవత్సరంలోనూ అలుపెరగని పయనం సాగిస్తున్న ఏవీఎం సంస్థ నుంచి ఒక సినిమా వస్తోందంటో ఎదురు చూసే ప్రేక్షకులు అప్పుడూ ఇప్పుడూ ఉండనే ఉన్నారు. జనరేషన్లు మారినప్పుడల్లా ఎప్పటికప్పడు మార్పును అందిపుచ్చుకుంటూ సినిమాలు తీయడమే ఏవిఎం విజయరహస్యంగా చెప్పుకోవచ్చు. కొద్దికాలం గ్యాప్ తర్వాత మళ్లీ తెలుగులో ఏవిఎం సంస్థ ఇవాల్టి యంగ్ జనరేషన్ ను దృష్టిలో పెట్టుకుని లైట్ హార్టెడ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా 'ఎవరైనా ఎపుడైనా' (ప్రేమలో పడొచ్చు) చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చింది. ప్రేమ కథా ఇతివృత్తాలు ఎప్పుడూ ఎవర్ గ్రీనే. కాదనలేం. వీటి ముగింపు అయితే సుఖాంతం...లేకపోతే దుఃఖాంతం. ఇంతకుమించి మూడో ఆప్షన్ కనబడదు. ప్రేమను ఒక హక్కుగా యువకులు భావిస్తే, అది బాధ్యతతో కూడి ఉండాలనేది అమ్మాయిలు కోరుకుంటారు. ఇందుకోసం యువకులు బాధ్యతాయుతంగా తమను తాము మలుచుకోవడం కూడా 'ప్రేమ' గెలుపు కిందే వస్తుంది. ఈ పాయింట్ నే ప్రధానంగా తీసుకుని మార్తాండ్ కె.శంకర్ ( ఎడిటర్ మార్తాండ్ కె.వెంకటేష్ సోదరుడు) దర్శకుడిగా ఈ చిత్రంతో తొలి ప్రయత్నం చేశారు. 'హ్యాపీడేస్', 'కొత్త బంగారులోకం' వంటి చిత్రాలతో యూత్ కు చేరువైన వరుణ్ సందేష్ ఈ చిత్రంలో కథానాయకుడుగా నటించడం సహజంగానే క్యూరియాసిటీని పెంచుతూ వచ్చింది. ఎవరైనా ఎపుడైనా ప్రేమలో పడొచ్చనే పాయింట్ ను సమర్ధవంతంగా చెప్పడంలో ఎంతవరకు ఫిల్మ్ మేకర్స్ సఫలమయ్యారో చూద్దాం.
వెంకట్ (వరుణ్ సందేష్) డబ్బున్న ఫ్యామిలీకి చెందిన యువకుడు. ఎలాంటి బాధ్యతలు లేకుండా హ్యాపీగా లైఫ్ ను ఎంజాయ్ చేసే రకం. వీలున్నప్పడుల్లా పార్కుల్లో ప్రేమజంటలకు టోకరా కొట్టించి నాలుగు డబ్బులు రాబట్టుకుంటూ ఉంటాడు. ఇదో సరదా. ఇలాంటి ఓ సందర్భంలోనే రౌడీలు ఛేజ్ చేస్తుండగా అక్కడున్న అద్దం పగిలి అందులో మధుమిత (విమలా రామన్) అనే అందమైన అమ్మాయి ప్రతిబింబం కనిపిస్తుంది. తొలి చూపులోనే ఆమె ప్రేమలో పడిపోతాడు. క్రమంగా మధుమిత కుటుంబ సభ్యులకు చేరువై ఆమె ప్రేమను పొందేందుకు రకరకాల ప్లాన్స్ వేస్తుంటాడు. అంతా సజావుగా సాగుతున్న తరుణంలో మధుమిత ప్రేమ కోసం వెంకట్ చేసిన ఓ పొరపాటు ఆమె కుటుంబంలో కల్లోలం రేపుతుంది. ఆ పొరపాటు పర్యవసానంగా రాజా అనే యువకుడితో మధుమిత అక్క భార్గవి నిశ్చితార్దం ఆగిపోతుంది. తాను చేసిన పొరపాటును సరిదిద్దుకునేందుకు వెంకట్ ఎలాంటి ప్రయత్నాలు చేశాడు? ఇందువల్ల అతని ప్రవర్తనలో కూడా ఎలాంటి మార్పు వచ్చింది? మళ్లీ మధుమిత మనసును ఎలా గెలుచుకోగలిగాడన్నదే మిగతా కథ.
Be first to comment on this News / Article!
Pages: 1 -2- -3-
|