'ఓయ్' రివ్యూ...
తరాలు మారుతున్నట్టుగానే ఒకర్ని మరొకరు సంబోధించుకునే పిలుపులూ మారుతుంటాయి. ఒకప్పుడు ఏవోయ్...ఇంటావిడదానా అని ఓ భర్త సదరు భార్యను పిలిస్తే...భర్త పేరు చెప్పడానికే బిడియపడే ఇల్లాళ్లు ఆనాటి సినిమాల్లో రివాజు. ఇప్పటికీ మన ఇళ్లలోని వృద్ధ దంపతుల్లో ఇలాంటి ఆప్యాయతతో కూడిన పిలుపులు క(వి)నిపిస్తాయి. ఇవాల్టి తరం ఒకింత స్పీడ్. లవ్ లో పడినప్పుడే ఏరా...ఒరేయ్...ఏరా..అని సంబోధించుకునే టైపు. 'ఓయ్' అని పిలవడం ఇంకో డేరింగ్ స్టెప్. పిలుపు ఏదైనప్పటికి అలా పిలిచిన వాళ్లు నచ్చితే ఆ పిలుపు కర్ణపుటాలకు ఇంపుగానే ఉంటుంది. సహజంగా ప్రతి ఒక్కరి నోళ్లలోనూ 'ఓయ్' అనే మాట నానుతూనే ఉంటుంది. అయితే ఈ పిలుపు ప్రేమికులకు ఆపాదిస్తే ఎలా ఉంటుందనే దర్శకుడు ఆనంద్ రంగా ఆలోచనకు వెండితెర రూపమే 'ఓయ్'. ఆదిలోనే టైటిల్ తో ఆలోచింపజేసిన దర్శకుడు మరోరకంగానూ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని నింపారు. అది...నాలుగేళ్ల బుడిబుడి ప్రాయంలోనే మణిరత్నం 'అంజలి' చిత్రంలో బాలనటిగా జాతీయ అవార్డు అందుకున్న షామిలిని ఈ చిత్రం ద్వారా కథానాయికగా పరిచయం చేయించి ఆమె నోటి ద్వారా 'ఓయ్' అని పిలిపించడం. నిన్నటి చిన్నారి జాబిల్లి...నేడు నిండుచందమామగా ప్రేక్షకుల ముందుకు వస్తోందంటే ఎలా ఉందో చూడాలనే ఉత్సుకత సహజమే కదా. షామిలి ట్రంప్ కార్డ్ అయిందా? 'ఓయ్' అనే ఆమె పిలుపునకు రియాక్షన్ ఏమిటి? ఓ సారి చూద్దాం.
ఉదయ్ (సిద్దార్ధ) తన ప్రియురాలు సంధ్య (షామిలి) తీపి జ్ఞాపకాలకు గుర్తుగా ఆకాశం నుంచి వర్షించే చినుకు కోసం ఎదురుచూస్తుంటాడు. అదే సమయంలో న్యూఇయర్ సెలబ్రేషన్లు జరుగుతుంటాయి. ఈ సెలబ్రేషన్లంటే నాకు చాలా ఇష్టం...కానీ గత ఏడాది నుంచి చేసుకోవడం లేదు. సంధ్య జ్ఞాపకాలను ప్రోదిచేసుకోవడం కోసం ఇక్కడ ఉన్నాను అంటాడు ఉదయ్. కట్ చేస్తే...కథ ఫ్లాష్ లోకి వెళ్లిపోయింది. ఉదయ్ ఓ ప్రముఖ పారిశ్రామిక వేత్త కొడుకు. జీవితంలోని ప్రతిక్షణాన్ని ఎంజాయ్ చేయాలనుకునే రకం. అందుకు పూర్తి భిన్నమైన వైజాగ్ అమ్మాయి సంధ్య. దైవభక్తి, క్షమశిక్షణ, జీవితాన్ని అందంగా మలుచుకోవాలనుకునే తపన మెండు. ఒకరోజు తన బర్త్ డే వేడుకను ఓ పబ్ లో జరుపుకొంటున్న తరుణంలో స్నేహితురాలి బలవంతం మీద అక్కడుకు వచ్చిన సంధ్య అతని కంటపడుతుంది. 'ఓయ్' అంటూ ఆమె పిలిచిన పిలుపుతో అతని గుండెల్లో కోటి వీణలు మోగుతాయి. అప్పట్నించి స్నేహ ప్రేమను పొందేందుకు ప్రయత్నిస్తుంటాడు. లీగల్ సమస్యల్లో ఉన్న సంధ్య ఇంటిని ఆమెకు ఇప్పించడంలో సహాయపడతాడు. క్రమంగా ఆమె ఇంట్లో మకాం వేస్తాడు. ఇద్దరి పేర్ల తరహాలోనే ఇద్దరి అభిరుచులూ, అలవాట్లు కూడా భిన్నమే కావడంతో సంధ్య కోరుకునే వ్యక్తిలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలనేది తెలివిగా తెలుసుకుని అట్నించి పావులు కదుపుతుంతాడు. క్రమంగా సంధ్య కూడా ఉదయ్ పట్ల అభిమానం పెంచుకుంటుంది. ఒకరోజు అతను లవ్ ప్రపోజ్ చేస్తాడు. ఆమె సమాధానం కోసం ఎదురుచూస్తున్న తరుణంలో సంధ్య ఓ ఎల్ఐసి పాలసీ తీసుకుని నామినీగా అతని పేరు ఇస్తుంది. అయితే సంధ్యకు జరిపిన మెడికల్ టెస్ట్ తర్వాత ఆ పాలసీ రిజెక్ట్ అవుతుంది. ఆ విషయం సంధ్యకు కాకుండా ఉదయ్ కు తెలుస్తుంది. అసలు సంధ్య ఆరోగ్యానికి వచ్చిన సమస్య ఏమిటి? ఉదయ్-సంధ్యల ప్రేమపై అది ఎలాంటి ప్రభావం చూపిందనేది మిగతా కథ.
Be first to comment on this News / Article!
Pages: 1 -2- -3-
|