'వెంగమాంబ' రివ్యూ
కథ, విస్తరణ, చిత్రానువాదం, మాటలు వంటి విభిన్న శాఖలను కూడా దర్శకుడు ఉదయ భాస్కర్ చేపట్టడంతో పట్టుగా సినిమాను నడిపారు అయితే మంచి కథాక్రమంలో కమర్షియల్ అంశాల కోసమన్నట్టుగా మేజువాణి పాట, తుంబరకోనలోని కోయవాళ్ల పాట చేర్చడం సముచితంగా అనిపించదు. ఆ రెండు పాటలూ లేకున్నా కథాగమనానికి వచ్చిన నష్టం లేదు.
'అంబా..జగదాంబ' వంటి కొన్ని పాటల్లో ఉపయోగించిన గ్రాఫిక్ వర్క్, ఒక చోట వాడిన 'అన్నమయ్య' సినిమా క్లిప్పింగ్స్ ఆకట్టుకుంటాయి. ఆనాటి కట్టుబాట్లపై తిరుగుబాటు చేసిన వెంగమాంబను ప్రశ్నించేందుకు పుష్కగిరి పీఠాధిపతి నృసింహ సరస్వతి స్వామి వచ్చి వెంగమాంబలో ప్రహ్లాదుని చూసి కైమోడ్చడం, భర్త పోయినప్పుడు వెంగమాంబ నిబ్బరం చూపడం, ముత్యాల హారతిని ఆనువంశికం చేస్తానంటూ వెంగమాంబకు శ్రీవారు అభయమిచ్చిన ఘట్టాలను దర్శకుడు ప్రతిభావంతంగా తెరకెక్కించారు. అలాగే... తాళ్లపాక వారి లాలిపాటకూ, తరిగొంగ వారి ముత్యాల హారతికీ ఉన్న ప్రాధాన్యతనూ చక్కగా వివరించారు.
వెంగమాంబ పాత్ర మీనా కోసమే పుట్టిందా అన్నట్టుగా ఆ పాత్రలో ఆమె పరకాయప్రవేశం చేసింది. మొదట్లో ఆహార్యం పరంగా కొంచెం లావుగా అనిపించినప్పటికీ క్రమంగా ఆ స్థానే ఆమె పాత్రే ప్రేక్షకులకు కనిపిస్తుంది. అంత సహజంగా తన పాత్రను మీనా పోషించింది. వృద్ధురాలి గెటప్ కూడా బాగా కుదిరింది. మీనా భర్తగా చేసిన నటుడు తన పాత్రకు న్యాయం చేశారు. వేంకటేశ్వర స్వామి పాత్రకు సాయికిరణ్ సరిపోయారు. అక్కడక్కడా మేకప్ అతిగా అనిపిస్తుంది. ఆయనకు కృష్ణుడు, రాముడు గెటప్ లు కూడా బాగా కుదిరాయి.
శరత్ బాబు, సన, సుబ్బరాయశర్మ, రాగిణి, అశోక్ కుమార్ వంటి నటులు పోటీపడి నటించారు. నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో అనంత్ రాణించాడు. విధవ పాత్రలో చాలాకాలం తర్వాత నటి కృష్ణవేణి, కోయదొరగా మాడా వెంకటేశ్వరరావు, వెంగమాంబ గురువుగా 'లవకుశ ' నాగరాజు కనిపించి అలరించారు. ఎల్బీశ్రీరామ్ కు డబ్బింగ్ వాయిస్ చెప్పించినట్టు కనిపిస్తుంది. లిప్ మూమెంట్ కుదరక కొంచెం కృతకంగా ఉంది.
Be first to comment on this News / Article!
Pages: -1- -2- 3 -4-
|