'అడవి' రివ్యూ
రామ్ గోపాల్ వర్మ కొద్దికాలంగా తన శిష్యులను దర్శకులుగా మార్చి నిర్మాతగా సినిమాలు తీస్తున్నారు. మరికొన్ని చిత్రాలకు ఆయనే దర్శకత్వం వహిస్తున్నారు. అయితే వర్మ ఇప్పుడు ఆ రెండూ తానే అయి (యు టీవీ మోషన్ పిక్చర్స్ తో కలిసి) ఈ సినిమా తీయడం సహజంగానే అంచనాలకు తావిచ్చింది. అయితే వర్మ మార్క్ ముద్ర ఈ చిత్రంలో అస్పష్టంగానే కనిపిస్తుంది. కేవలం సౌండ్ ఎఫెక్ట్స్, కెమెరా యాంగిల్స్ తోనే ప్రేక్షకులను కొద్దిగా భయపెట్టగలిగారు. ఈ తరహా చిత్రాలకు ఆ మోతాదు సరిపోదు. అయితే కథలో అంతర్లీనంగా హ్యూమన్ రిలేషన్స్ గురించి టచ్ చేయడం బాగుంది. మృత్యువు పొంచి ఉన్నప్పుడు ఎవరికి వారు స్వార్థపరులుగా మారిపోతారనీ, అలాగే ఆఖరి నిమిషంలోనైనా తన ప్రేమను వెల్లడించాలని మరికొందరు తపన పడతారనీ చూపించడం మెచ్చుకోలుగా ఉంది. హీరో అసిస్టెంట్ 'దుర్గామాత' డాలర్ పట్టుకుని తన ప్రాణాలు కాపాడుకోవాలని ప్రయత్నించినప్పటికీ మృత్యువాత పడతాడు. దైవశక్తి కూడా ఎవర్నీ కాపాడలేదని వర్మ అభిప్రాయం కావచ్చు. కాకుంటే...కొద్దిపాటి హ్యూమర్ కోసం ఆ పాత్రను ఉపయోగించుకుని ఉంటారని సరిపుచ్చుకోవచ్చు.
Read 1 Comment(s) posted so far on this News / Article!
Pages: -1- 2 -3- -4-
|