మర్డర్ మిస్టరీతో కూడిన హారర్ థ్రిల్లర్స్ కు ముగింపే కీలకం. అయితే వర్మ ఉడికీ ఉడకని వంటకాన్ని సిద్ధం చేసినప్పుటు ముగింపు ఇవ్వకుండానే కుర్చీల్లోంచి ప్రేక్షకులను లేపేశారు. 'ది ఎండ్' కార్డ్ ప్లేస్ లో 'త్వరలో వస్తోంది అడవి-2' అనే ఫినిషింగ్ కార్డ్ ఇచ్చారు. 'అడవి'లో మర్టర్లు చేసిందెవరనేది మిస్టరీ తెలుసుకోవాలంటే సీక్వెల్ వచ్చేవరకూ వెయిట్ చేయమని వర్మ మనోగతం కావచ్చు. అయితే
'అడవి' అర్ధాంతరమైన ముగింపు ప్రేక్షకులకు మింగుడు పడటం ప్రశార్థకమే. ఎలాగూ 'అడవి 2' అనౌన్స్ చేశారు కాబట్టి తెలివైన ప్రేక్షకుడు అప్పుడే 'ఆడవి' చూస్తే పోలాదా అనుకుంటే వారనీ తప్పు పట్టలేం...