'అడవి' రివ్యూ
నితిన్ తొలిసారి ఈ చిత్రం హిందీ వెర్షన్ 'అగ్యాత్'తో బాలీవుడ్ లోకి అడుగుపెట్టారు. హిందీ యువహీరోలకు తాను ఏమాత్రం తీసిపోనని నితిన్ నిరూపించుకున్నాడు. నటుడిగా మంచి బ్యాలెన్స్ తో నటించడంతో పాటు ఒక పాటలో ఎయిట్ ప్యాక్ ప్రదర్శించి ఆకట్టుకున్నారు. ప్రియాంక కొఠారి గ్లామరస్ గా ఉంది. సందర్భోచితమైన నటన సైతం ప్రదర్శించింది. పబ్లిసిటీలో సంచలనం రేకెత్తించిన బికినీ సన్నివేశాలు కొన్ని స్క్రీన్ పై కనిపించవు. రెండు సాంగ్స్ లో ఆమె అందాలు ప్రేక్షకులను చూపుతిప్పనీయవు. మిగిలిన నటీనుటులంతా తమ పాత్రల పరిధి మేరకు నటించారు.
సాంకేతికపరంగా సుర్జోదీప్ ఘోష్ కమెరా వర్క్ ప్రశంసనీయంగా ఉంది. ఫారెస్ట్ సినిమాలంటే సహజంగా లైటింగ్ తక్కువ చేసి డిమ్ గా చూపించడం కనిపిస్తుంది. అయితే ఘోష్ చక్కటి లైటింగ్ వర్క్ తో సన్నివేశాలకు అవసరమైన బలం చేకూర్చారు. బాపి-టుటూల్, ఇమ్రాన్ విక్రమ్ ల సంగీతం, అమీర్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మెచ్చుకోలుగా ఉంది. 'ఐ వాంట్ కిస్ యు డే అండ్ నైట్' సాంగ్, చిత్రీకరణ ఎక్స్ లెంట్. సెన్సార్ కత్తెర పడినట్టు ప్రచారం జరిగిన 'బోలే శివ శంకర్' పాట పెద్దగా ప్రేక్షకులపై ఇంపాక్ట్ చూపదు. 'ఈ రోజుల్లో సిక్సె ప్యాక్ ఉంటే ఎవరైనా హీరోనే' వంటి ఒకటి రెండు చమక్కులు మినహా సంభాషణలు సాదాసీదాగానే ఉన్నాయి. నిపున్ అశోక్ గుప్తా ఎడిటింగ్ (1.45 నిమిషాల నిడివి) క్రిస్ప్ గా ఉంది. రానీ స్క్రూవాలా, వర్మ నిర్మాణవిలువలు కూడా తగినట్టుగానే ఉన్నాయి.
Read 1 Comment(s) posted so far on this News / Article!
Pages: -1- -2- 3 -4-
|