'లైఫ్ స్టైల్' రివ్యూ
బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకుంటున్న వారిలో ఆనంద్ (నిశ్చల్) గ్రూప్ అందరి దృష్టినీ ఆకర్షిస్తుంటుంది. ఈ మిత్రబృందంలో ఆనంద్, ప్రభు, లక్ష్మణ్ అలియాస్ లక్కీతో పాటు ప్రియ (మోనాలి చౌదరి), నందిని (అనన్య) ఉంటారు. క్యాంపస్ రిక్రూట్ మెంట్ కోసం ఓ మల్టీ నేషనల్ కంపెనీ నిర్వహించిన ఓ ఇంటర్వ్యూ కు వీరంతా హాజరవుతారు. ఈ ఐదుగురిలో లక్కీ మినహా తక్కిన నలుగురు ఎంపికవుతారు. అందరూ ఒకచోటే కలిసి పనిచేయాలనుకున్న మిత్ర బృందం ఆ ఉద్యోగాలు వద్దనుకుంటారు. వీరి స్నేహానికి ముచ్చట పడిన ఆ కంపెనీ తమ తుది జాబితాలో లక్కీని కూడా సెలెక్ట్ చేస్తారు. అంతా క్యాంపస్ లో ఈ సంబరాన్ని జరుపుకొంటున్న తరుణంలో ప్రభు తండ్రి (భువనచంద్ర) అక్కడకు వచ్చి అతన్ని తన ఊరు తీసుకువెళ్లిపోతాడు. ప్రభు ఎంత వారిస్తున్నా వినకుండా అతని పెళ్లి జరిపిస్తాడు. తిరిగి కాలేజీకి వచ్చిన ప్రభు తన పెళ్లి విషయాన్ని దాస్తాడు. ఎలాగో ఆ విషయం బయటకు పొక్కుతుంది. స్నేహ ధర్మాన్ని విస్మరించావంటూ ప్రభు మిత్రులంతా అతన్ని తప్పుపడతారు. అందరికీ కంపెనీ నుంచి జాయినింగ్ ఆర్డర్లు వస్తాయి. ప్రభు మాత్రం తన పోస్టింగ్ ముంబై వేయించుకుంటాడు. తక్కిన నలుగురు మిత్రులు వైజాగ్ లో ఉద్యోగాల్లో చేరతారు. ఈ నలుగురూ ఒకే విల్లాలో ఉంటారు. ప్రభు కోసం ఓ గది కూడా కేటాయిస్తారు. ప్రియ, నందిని వేరే వాళ్లను పెళ్లి చేసుకుని అక్కడే కాపురం చేస్తూ తమ మిత్రులతో కలిసే ఉంటారు. ఒకరోజు ప్రాజెక్ట్ వర్క్ కోసం ఆనంద్, లక్కీ ఒక రైలులో బయలుదేరుతారు. అదే రైలులో ప్రయాణిస్తున్న అంజలి (మీనాక్షి దీక్షిత్) అనే అమ్మాయి ఆనంద్ కు తారసపడుతుంది. తొలిచూపులోనే అంజలి అతనికి బాగా నచ్చేస్తుంది. అంజలి ఓ స్టూడియో నడుపుతుంటుంది. క్రమంగా ఆమెతో ఆనంద్ పరిచయం పెంచుకుంటాడు. ఒక సందర్భంలో తన ఇంటికి రమ్మని ఆనంద్ ను ఆమె ఆహ్వానిస్తుంది. మిత్రులతో కలిసి అక్కడకు వెళ్లిన ఆనంద్ తన ప్రేమను చెప్పాలనుకుంటాడు. అయితే అనూహ్యంగా అంజలి మరెవరో కాదనీ, ప్రభు భార్య అనీ తెలుసుకుని షాక్ తింటాడు. అసలు ప్రభు ఏమయ్యాడు? కట్టుకున్న భార్యకు ఎందుకు దూరంగా ఉండాల్సి వచ్చింది? అంజలిపై తన ప్రేమ ఒకవైపు, ప్రభుతో స్నేహధర్మం మరొకవైపు ఆనంద్ ను ఉక్కిరిబిక్కిరి చేసినప్పుడు అతను ఎలాంటి స్టెప్ తీసుకున్నాడు? చివరకు అంజలి, ఆనంద్ జీవితాలకు ముగింపు ఏమిటనేది మిగతా కథ.
Read 3 Comment(s) posted so far on this News / Article!
Pages: -1- 2 -3- -4-
|