'లైఫ్ స్టైల్' రివ్యూ
ఆనంద్ రాసిన 'లైఫ్ స్టైల్' అనే పుస్కకావిష్కరణ బాపట్ల కాలేజీలోనే ఆవిష్కరించే ఘట్టంతో దర్శకుడు ముప్పలనేని శివ సినిమాను ప్రారంభించి..క్రమంగా కథను ఫ్లాష్ బ్యాక్ లోకి నడిపారు. మిత్రులందరినీ చివర్లో ఒకే వేదిక మీదకు తీసుకురావడం ద్వారా శుభం కార్డు వేశారు. నిజానికి ఎత్తుగడ, ఫినిషింగ్ అంతా క్రమపద్ధతిలోనే దర్శకుడు నడిపినప్పటికీ విశ్రాంతి కార్డు వరకూ ఇంచుమించు కాలేజీ బ్యాక్ డ్రాప్ లో 'హ్యాపీడేస్' ను గుర్తు చేస్తోంది. అయితే విశ్రాంతికి వచ్చే ట్విస్ట్ ...ఆ తర్వాత అంజలి, ఆనంద్ పాత్రల మధ్య సంఘర్షణ వంటివి మాత్రం దర్శకుడు తన స్టయిల్ లోనే నడిపించారు. ఒకప్పుడు అదే కాలేజీలో క్యాంపస్ ఇంటర్వ్యూ లో పాల్గొన్న ఐదుగురు మిత్రులు చివర్లో ఒక కంపెనీ స్థాపించి అదే క్యాంపస్ లో ఇంటర్వ్యూలు జరపడానికి రావడం దర్శకుడు ఇచ్చిన మంచి ఫినింషింగ్ టచ్.
మిత్రులుగా నిశ్చల్, కార్తీక్, అభిరామ్, మీనాక్షి దీక్షిత్, మొనాలి చౌదరి చాలా సహజంగా నటించారు. ముఖ్యంగా కెమెరాకు పూర్తిగా కొత్తే అయినప్పటికీ నిశ్చల్ మంచి నటన ప్రదర్శించారు. డాన్సులు, ఫైట్స్ లో మంచి ఈజ్ కనబరచారు. మంచి పాత్రలు దొరికితే హీరోగా నిలదొక్కుకునే అవకాశాలు ఇతనిలో మెండుగా ఉన్నాయి. స్లిమ్ గా, పొడుగ్గా కనిపించే మీనాక్షి దీక్షిత్ నటి మమతా దాస్ ను తలపించింది. పాటల్లో గ్లామర్ ప్రదర్శనతోనూ అలరించింది. పాటల రచయిత భువనచంద్ర తొలిసారిగా నటించినప్పటికీ మంచి ఆర్టిస్టు ఆయనలో ఉన్నాడనిపిస్తుంది. నారాయణరావు, సన, శివపార్వతి తదితరులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు. బ్యాంకాక్ లో టూరిస్ట్ గైడ్ గా బ్రహ్మానందం కామెడీ ఆయనే నటించిన 'మన్మథుడు' చిత్రంలోని కామెడీ ఎపిసోడ్లకు చాలా దగ్గరగా ఉంది. దీంతో కామెడీ డల్ అయింది.
Read 3 Comment(s) posted so far on this News / Article!
Pages: -1- -2- 3 -4-
|