'లైఫ్ స్టైల్' రివ్యూ
నిశ్చల్-మీనాక్షి దీక్షిత్ పై బ్యాంకాక్ లో చిత్రీకరించిన పాటలు, వీటికి అందించిన కొరియోగ్రఫీ, ముఖ్యంగా స్టడీకామ్ ప్రసాద్ కెమెరా వర్క్ మెచ్చుకోలుగా ఉన్నాయి. శ్రీజ సంగీతం అందించిన పాటల్లో 'తరగని గని...', 'కసి ఓర చూపులే చుమ్మా చుమ్మారే' సాంగ్స్ యూత్ ఫుల్ గా ఉండి ఆకట్టుకుటాంయి. ఘటికాచలం సంభాషణలు కూడా ఫరవాలేదు. 'ప్రపంచంలో ఈక్వాలిటీ అనేది ఒక్క కాలేజీ క్యాంపస్ లలోనే కనిపిస్తుంది', 'మోసగాళ్లు లవర్స్ కావచ్చు...నిజమైన లవర్ ఎప్పటికీ వంచకుడు కాలేడు', 'బ్యాంకాక్ లో స్టెల్లాలు, లిజీలు ఉండొచ్చు...కానీ ఒక్క సీత, సావిత్రిని చూపగలవా?' వంటి సందర్భోచిత సంభాషణలు అలరిస్తాయి. చిన్న సినిమా అయినా
మంచి నిర్మాణ విలువలను మాధవ్ పట్నాయక్, కోగంటి రామకృష్ణ పాటించారు.
సినిమా ప్రథమార్థం 'హ్యాపీడేస్'కు దగ్గరగా ఉన్నా ద్వితీయార్థం మంచి మలుపులతో, కథానాయకుడి పాత్రలో ఒకింత నెగిటివ్ ఛాయలు ఉన్నట్టు భ్రమించే రీతిలో దర్శకుడు కథను నడిపించారు. ఎక్కడా విసుగు రాకుండా సందర్భోచితమైన పాటలు చొప్పించారు. స్నేహం, ప్రేమ, త్యాగం వంటి అంశాల చుట్టూ కథ అల్లుకోవడంతో కాలేజీ యూత్ కు దగ్గరయ్యే అవకాశాలున్నాయి. అయితే నిర్మాతలు తగినంత పబ్లిసిటీ ఇచ్చినప్పుడే ఇది సాధ్యమవుతుంది. రెండు పెద్ద సినిమాలు రిలీజ్ అయి, మరో రెండు పెద్ద చిత్రాలు మరో పదిరోజుల్లో విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో 'లైఫ్ స్టైల్' రావడం వల్ల అందరి దృష్టిలోనూ ఈ చిత్రం పడే అవకాశాలు అంత మెరుగ్గా లేవు. యువత తమ లక్ష్యాలను సాధించేందుకు ఎంత కష్టపడాలో...'లైఫ్ స్టైల్' ఫిల్మ్ మేకర్స్ కూడా పబ్లిసిటీ పరంగా అంతే కష్టపడితే తగినంత ఫలితం ఉండొచ్చు. లేకుంటే బాక్సాఫీస్ ఫలితం చేజారిపోవచ్చు...
Read 3 Comment(s) posted so far on this News / Article!
Pages: -1- -2- -3- 4
|