'శంఖం' రివ్యూ
దర్శకుడు శివ అసలు కథ కంటే హీరో హీరోయిన్ల మధ్య రొమాన్స్, కామెడీ ట్రాక్, డబుల్ మీనింగ్ డైలాగ్స్ కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం కనిపిస్తుంది. ఇవి కీలకమైన ఇంగ్రేడియన్సే...కాదనలేం. అయితే అసలు కథ సైడ్ లైన్ కాకూడదు. అలాగే హీరోకి ధీటైన ప్రతినాయకుడు లేని లోటు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. హీరో కంటే హీరో తండ్రి పాత్రలోనే హీరోయిజం ఎక్కువ. చావుబతుకుల మధ్య ఉన్న హీరోని తన కొడుకుగా సత్యరాజ్ గుర్తించే కీలక సన్నివేశం సైతం ప్రేక్షకులలో ఎలాంటి ఉద్వేగాన్ని కలిగించదు. ఎక్కడో ఆస్ట్రేలియాలో ప్రేమించుకుని..కడపలో మళ్లీ కలిసిన హీరోహీరోయిన్ల మధ్యే ఎక్కువ కథను నడిపిన దర్శకుడు చివర్లో ఇద్దర్నీ పెళ్లి పీటల మీద చేర్చడం మాత్రం మర్చిపోయారు.
గోపీచంద్ యాక్షన్ హీరోగా మరోసారి తన జబ్బసత్తా చాటుకున్నారు. ఈసారి ఆయనలోని రొమాంటిక్ కోణం బయటకు వచ్చింది. అలాగే కామెడీ కూడా తేలిగ్గానే పండించారు. సంప్రదాయబద్ధంగా కనిపించే త్రిష ఈ సినిమాతో పూర్తిగా గ్లామర్ బాట పట్టినట్టే. మినీ స్కర్ట్ లు, టర్కీ టవల్ షాట్స్ లోనూ కనిపించి ఇవాల్టి యువతరం హీరోయిన్ల రేసులో వెనక్కి తగ్గేది లేదని చెప్పకనే చెప్పింది. త్రిష ఒంటిపై టట్టూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. గోపీచంద్-త్రిష రొమాంటిక్ ఘట్టాల్లో...'చుక్కలు కనిపించాయా...కాదు పిక్కలు కనిపించాయి' వంటి డబుల్ మీనింగ్ డైలాగ్స్ కూడా దొర్లాయి. సీమ ఫ్యాక్షన్ లీడర్ గా సత్యరాజ్ తన పాత్రను ఎంతో హుందాగా పోషించారు. కోట శ్రీనివాసరావు ఈ తరహా విలనీ చాలా సినిమాల్లో చేసినప్పటికీ ఈసారి కూడా తన పాత్రలో ఇమిడిపోయారు. సైప్ అలీ ఖాన్ గా ఆలీ కామెడీ మంచి రిలీఫ్.
కోట సహాయకుడు-క్రిమినల్ లాయర్ గా కృష్ణ భగవాన్, త్రిష బావగా వేణుమాధవ్, గోపీచంద్ ఫ్రెండ్ గా శ్రీనివాస రెడ్డి, డాక్టర్ పాత్రలో ఒకే సన్నివేశంలో కనిపించిన రఘుబాబు, అలాగే తెలంగాణ శకుంతల, ధర్మవరపు తగినంత కామెడీ అందించారు.
Be first to comment on this News / Article!
Pages: -1- -2- 3 -4-
|