సాంకేతికపరంగా వెట్రి సినిమాటోగ్రఫీ పనితనం మెచ్చుకోలుగా ఉంది. తమన్ సంగీతం సమకూర్చిన పాటల్లో హమ్మింగ్ చేసుకునేవి కనిపించవు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ లోనూ తగినంత ఫోర్స్ లోపించింది. అనిల్ రావిపూడి మాటలు ఫరవాలేదు. గోపీచంద్ చిత్రాల తరహాలో ఇందులో స్టంట్ సీక్వెన్స్ లు కూడా తక్కువే. గౌతంరాజు ఎడిటింగ్ ఓకే. నిర్మాతలు జె.భగవాన్-జె.పుల్లారావు చక్కటి నిర్మాణ విలువలు పాటించారు.
సినిమా ప్రథమార్థం హీరోహీరోయిన్ల రొమాన్స్, కామెడీ అంశాలతో నడిస్తే ద్వితీయార్థంలో సాగతీత ఎక్కువ. హడావిడి ముగింపు ఇచ్చారు. త్రిష గ్లామర్ ఈ చిత్రానికి ప్రధాన అట్రాక్షన్ గా నిలుస్తుంది. గోపీచంద్ నుంచి ఎగ్రసివ్ యాక్షన్ ను ఎక్కువగా ఆశించే వాళ్లకు కొంత నిరాశ తప్పకపోవచ్చు. ఓవరాల్ గా...శంఖం మోత కంటే కూతతో యావరేజ్ ముద్ర వేయుంచుకుంటుంది.