'బాణం' రివ్యూ
నేటి సమాజ స్థితిగతులు సగటు మనిషిని కంటికి నిద్రలేకుండా చేస్తున్నాయి. పోలీసు విభాగం పలు లోపాల వల్ల జనంలో ఉండి వైఫల్యం చెందుతుంటే...నక్సల్ ఉద్యమం అడవుల్లో ఉండి వైఫల్యం చెందుతోంది. ఇది వైఫల్యం కాదంటే...ఇవాల్టికీ గ్రామానికో సంఘ వ్యతిరేక శక్తి ఎలా రాజ్యమేలుతోంది? ఇందుకు పరిష్కారం ఏమిటి? సమాజాన్ని పట్టి పీడిస్తున్న సమస్యలను పరిష్కరించడం కాదు...దానిని తుడిచేయాలి. యువకులకు ఎక్కడో పోలీస్ అకాడమీలో కాకుండా నేరస్థుల మధ్యే ట్రైనింగ్ ఇవ్వాలి. ఇవే ప్రాక్టికల్స్ కావాలి. ఇదంతా ఐ.పి.ఎస్. కావాలనే పట్టుదలతో ఉద్యమించిన ఓ యువకుడి ఆలోచన...ఆక్రోశం. అలాంటి ఓ సంఘ విద్రోహ శక్తిపై ఆ యువకుడు ఎక్కుపెట్టిన అస్త్రమే 'బాణం'. రాజకీయ నేపథ్యం నుంచి వచ్చిన నారా రోహిత్ కు ఇది హీరోగా తొలి సినిమా. అలాగే దర్శకుడు చైతన్య దంతలూరికి కూడా ఇది తొలి అడుగే. రొటీన్ గా కొత్త దర్శకులతో లవ్ సబ్జెక్ట్ లతో 'సేఫ్ గేమ్' ఆడతారు. సీరియస్ సబ్జెక్ట్ జోలికి వెళ్లరు. అయితే రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా దర్శకుడు ఒకింత రిస్క్ తీసుకుని ఈ సినిమా చేశారని చెప్పొచ్చు. అలాగే వైజయంతీ మూవీస్ కు అనుబంధంగా అశ్వనీదత్, ప్రియాంకదత్, శేషు ప్రియాంక కలిసి 'త్రీ ఏంజిల్స్' బ్యానర్ పై చేసిన తొలి ప్రయత్నమిది. హీరో, దర్శకుడితో పాటు బ్యానర్ కూడా కొత్తదే కావడంతో సహజంగానే అందరి దృష్టిని ఈ ప్రాజెక్ట్ ఆకర్షిస్తూ వచ్చింది. బాణం ఓ 'నిశ్శబ్ద విప్లవం'గా దర్శకుడు అభివర్ణించడం మరిన్ని అంచనాలను పెంచింది. ఆ అంచనాల టార్గెట్ ను 'బాణం' ఎంతవరకూ రీచ్ అవుతుందనేది చూద్దాం...
భగత్ పాణిగ్రాహి (నారా రోహిత్) సివిల్స్ కు ప్రిపేర్ అవుతుంటాడు. పోలీస్ ఆఫీసర్ కావాలన్నదే అతని లక్ష్యం. అతని తండ్రి శేఖర్ పాణిగ్రాహి (సాయాజీ షిండే) ఓ నక్సలైట్. సెంట్రల్ కమిటీ సభ్యుడైన శేఖర్ ఒకరోజు హోం మంత్రి ముందుకు లొంగిపోతాడు. ఎప్పుడో పదేళ్ల వయసులో విడిచివెళ్లిన భరత్ ను కలుసుకుని అతనితోనే ఉంటాడు. పోలీస్ ఆఫీసర్ కావాలన్న భరత్ పట్టుదల చూసి నిజాయితీగా ఉండాలనుకుంటేనే పోలీసు ఆఫీసర్ కమ్మని సూచన చేస్తాడు. భరత్ ఒకరోజు ట్రైనులో ప్రయాణిస్తూ ఫ్లాట్ ఫామ్ మీద రోజంతా ఒంటరిగానే ఉన్న సుబ్బలక్ష్మి (వేదిక)ని చూస్తాడు. సుబ్బలక్ష్మికి అంతకు ముందు రోజే పెళ్లవుతుంది. అత్తమామలు కట్నం తెమ్మంటూ బయటకు గెంటేస్తారు. అదోరోజు తండ్రి చనిపోతాడు. ఆమె కష్టం తెలుసుకున్న భరత్ తనవెంట ఇంటికి తీసుకువెళ్తాడు. ఆ తర్వాత క్రమంలో ఆమెకు గార్డియన్ అవుతాడు. మరోవైపు రణస్థలి అనే ప్రాంతాన్ని శక్తి పట్నాయక్ (రణధీర్) అనే వ్యక్తి తన గుప్పిట్లో పెట్టుకుని సంఘ వ్యతిరేక పనులకు పాల్పడుతుంటాడు. అనుకోని ఓ సంఘటన కారణంగా భరత్ కూ, శక్తి కి మధ్య ఘర్షణ తలెత్తుతుంది. శక్తి లాంటి అరాచక శక్తులను అంతమొందించేందుకు పోలీస్ ఆఫీసర్ కావాలనే పట్టుదల భరత్ లో మరింత పెరుగుతుంది. భరత్ ను ఏవిధంగానైనా నిరోధించి అడ్డుతొలగించుకోవాలని శక్తి ప్లాన్ చేస్తుంటాడు. ఈ క్రమంలో భరత్ పోలీస్ ఆఫీసర్ అయ్యాడా? 'శక్తి'ని అణచివేసే 'బాణం'గా అతను చేపట్టిన ఆపరేషన్ ఏవిధంగా ముగిసిందనేది మిగతా కథ.
Be first to comment on this News / Article!
Pages: 1 -2- -3-
|