'ఈనాడు' రివ్యూ
కమల్ హాసన్ 'సాగరసంగమం' చిత్రంలో చైల్డ్ ఫోటోగ్రాఫర్ గా నటించిన చక్రి తోలేటి ఆసక్తికరంగా అదే కమల్ చిత్రం ద్వారా దర్శకుడిగా తొలి అడుగు వేయడం విశేషం. రీమేక్ అయినప్పటికీ నేటివిటీకి దగ్గరగా హైద్రాబాద్ లోని పాపులర్ లొకేషన్లను ఎంచుకోవడం ద్వారా దర్శకుడు ఇది స్ట్రయిట్ ఫిల్మ్ అనే ఫీలింగ్ కలిగించారు. సీరియస్ సబ్జెక్ట్ కావడంతో కథలో ఎలాంటి ట్విస్ట్ లు, పాటల జోలికి వెళ్లకపోవడం సముచితమే. స్టార్ హీరో నుంచి రాజకీయనాయకుడైన సంతోష్ అనే వ్యక్తి తనకు జడ్ కేటగిరి సెక్యూరిటీ ఇమ్మని అడిగే అప్రధాన ఘట్టం కథకు ఏమాత్రం ఉపయోగపడదు. ఆ ప్లేస్ లో తీవ్రవాదం వల్ల సమాజం ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటోందో తెలియజేసే రియల్ ఇన్సిడెంట్లు (గోకుల్ ఛాట్, లుంబినీ పేలుళ్ల అనంతర పరిస్థితిని) చేర్చి ఉండే కథకు బలం చూకూరి ఉంటోంది. అప్పుడు ఒకింత నిడివి (1.45 గంటలు) పెరిగినా ఇబ్బంది ఉండదు. అలాగే రైలులో ప్రయాణించే పోలీస్ ఆఫీసర్ గౌతమ్ భార్యను నాలుగైదు సార్లు చూపించి చివర్లో ఆమె రైలు సేఫ్ గా దిగిందని చూపించడం దర్శకుడు మరిచిపోయారు. అయితే ఐఎఎస్ లకూ, ఐపిఎస్ లకూ (వెంకటేష్-లక్ష్మి) మధ్య కనిపించే ఇగో క్లాష్ లను ఆయన హ్యాండిల్ చేసిన తీరు ఆసక్తి కలిగిస్తుంది.
పద్శశ్రీ కమల్ హాసన్, విక్టరీ వెంకటేష్ సమ ప్రాధాన్యం ఉన్న పాత్రలు పోషించినప్పటికీ వెంకటేష్ నటనను ఆడియెన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. సిన్సియర్ అండ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా వెంకటేష్ విజృంభించి నటించారు. మొదట్నించీ చివరి వరకూ సీరియర్ గా కనిపించడం ద్వారా ఎక్కడా బిగి సడలని నటన ప్రదర్శించారు. ముఖ్యంగా లక్ష్మితో వాగ్యుద్ధం చేసే సందర్భాల్లో ఎక్స్ లెంట్ పెర్ ఫారమెన్స్ కనబరచారు. 'నేను ఎవరికీ సెక్రటరీని కాను...ఐయామ్ ఓన్లీ ఎ కమిషనర్. డిగ్నిఫైట్ వాచ్ మన్' అనే సంభాషణకు ప్రేక్షకుల నుంచి మంచి రియాక్షన్ లభిస్తోంది. నటనలో కమల్ ఆయనకు ఆయనే సాటి. అయితే ఆయన నటనలోని డెప్త్ ను దర్శకుడు ఇంకా బాగా ఉపయోగించుకుని ఉండాల్సిందనిపిస్తుంది. కమల్ ఫోనులో తన భార్యతో మాట్లాడే సందర్భాలు అంత సీరియస్ లోనూ కొంత అహ్లాద పరుస్తారు. ఆసక్తికరంగా ఫోన్ వాయిస్ తప్ప కమల్ భార్య ఎవరనేది చూపించలేదు. అరిఫ్ అనే సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో గణేష్ వెంకట్రామన్, మరో పోలీసు అధికారి గౌతమ్ గా భరత్ రెడ్డి తమ పాత్రలకు చక్కటి న్యాయం చేశారు. గౌతమ్ భార్యగా పూనమ్ కౌర్ ఓ చిన్న పాత్ర పోషించింది. లక్ష్మి నటన ఫరవాలేదు.
Be first to comment on this News / Article!
Pages: -1- -2- 3 -4-
|