'ఈనాడు' రివ్యూ
సాంకేతికపరంగా ఈ చిత్రాన్ని పూర్తిగా రెడ్-1 డిజిటల్ కెమెరాతో చిత్రీకరించడంతో చక్కటి క్వాలిటీ కనిపిస్తుంది. మనోజ్ సోని ఫోటోగ్రఫీ నీట్ గా ఉంది. ఈ తరహా చిత్రాలకు సంభాషణలే కీలకం. ప్రముఖ దర్శకుడు నీలకంఠ చేత సంభాషణలు రాయించారు. ఆయన రాసిన పలు సంభాషణలు ఆలోచించ జేసేవిగా ఉన్నాయి. 'బాత్రూంలోని బొద్దింక వంటింట్లోకి వస్తే చంపేస్తాం. నేనూ అంతే. నా ఇంటినీ, సమాజాన్ని కూడా క్లీన్ చేస్తున్నాను' (వెంకటేష్ తో కమల్ ఫోను సంభాషణ), 'కామన్ మన్ కు లేని రైట్స్ తీవ్రవాదులకు ఎందుకు?', 'కామన్ మన్ తలుచుకుంటే ఏదైనా చేయగలడు. ఆర్ డిఎక్స్ మాత్రమే కాదు ఆణుబాంబు కూడా సంపాదించగలను' వంటి సంభాషణలు మచ్చుకు కొన్ని. అయితే సంభాషణల్లో ఎక్కువ ఆంగ్ల పదాలు దొర్లడం వల్ల 'ఫ్రెంట్ బెంచెస్ ' ఆడియెన్స్ వాటిని ఎంజాయ్ చేయలేరు. శృతి హాసన్ మరింత బెటర్ గా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించి ఉండొచ్చు. రాణి స్క్రూవాలా, కమల్ హాసన్ ల నిర్మాణ విలువలు కూడా తగినట్టుగానే ఉన్నాయి.
సినిమా ప్రథమార్థంలో వేగం పాళ్లు తక్కువే అయినా సెకండాఫ్ పట్టుగా నడిచి ముగింపు ఆలోచింపజేస్తుంది. వ్యవస్థలోని లోపాల వల్ల అనుదినం వంచింపబడుతున్నసాధారణ మనిషి తిరగబడితే తీవ్రవాదం తోకముడుస్తుందని నిజాయితీగా చెప్పే ప్రయత్నం ముదావహం.మాస్ ఆడియెన్స్ కంటే మల్టీప్లెక్స్ ఆడియెన్స్ కు ఎక్కువ దగ్గరయ్యే చిత్రంగా దీనిని చెప్పుకోవచ్చు. అయితే 'వర్గీకరణ' పరంగా ఈ తరహా చిత్రాలను చూడటం సబబనిపించదు. టిక్కెట్టుకు వెచ్చించిన సొమ్ము గిట్టుబాటు అయిందా అని చూడటం అన్ని సినిమాలకూ వర్తించదు. రియల్లీ ఇటీజ్ ఎ కామన్ మన్ థాట్ ప్రవోకింగ్ ఫిల్మ్...డిజర్వ్ టు వాచ్ ఎవ్రీ వన్...
Be first to comment on this News / Article!
Pages: -1- -2- -3- 4
|