గణేష్ (రామ్) ఓ అనాథ. సాహసాలంటే ఇష్టం. తన-పర భేదం లేకుండా అందరికీ హెల్ప్ చేయడం అతని నైజం. ఆ గుణమే అతని జీవితాన్ని మలుపు తిప్పుతుంది. గణేష్ ఫ్రెండ్ ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆ విషయం తన తండ్రికి (కాశీ విశ్వనాథ్) చెప్పడానికి బయటపడుతుంటాడు. ఇందుకు ఓ కారణం ఉంది. తన కుమారుడికి చెల్లెలి కూతురైన దివ్య (కాజల్)కు ఇచ్చి పెళ్లి చేయాలని ఆ తండ్రి ఆలోచన. ప్రేమికులిద్దరూ గణేష్ ను ఆశ్రయిస్తారు. దివ్యను తాను ప్రేమలో పడేలా చేస్తే తన ఫ్రెండ్ లవ్ కు లైన్ క్లియర్ అవుతుందని భావించిన గణేష్ ప్రేమ నాటకానికి శ్రీకారం చుడతాడు. దివ్య ఉండే కొండాపూర్ లోని ఎక్స్ ప్రెస్ టవర్స్ అపార్ట్ మెంట్ లో అద్దెకు దిగాలనుకుంటాడు. ఆ అపార్ట్ మెంట్ అల్లరి పిల్లల సామ్రాజ్యం. ఎవరైనా అందులో దిగాలంటే బెదిరిపోతుంటారు. ముందు వాళ్లను మంచి చేసుకుంటే దివ్యను లవ్ ట్రాప్ లో పడేయడం ఈజీ అవుతుందని భావించిన గణేష్ పైపుల ద్వారా అపార్ట్ మెంట్ ఎక్కుతూ పిల్లల దృష్టిలో పడతాడు. ఓ గడుగ్గాయి కుర్రాడు 'అదిగో సూపర్ మాన్' అనడంతో గణేష్ కూడా సూపర్ మన్ గానే సెటల్ అవుతాడు. సూపర్ మన్ ఫీట్స్ చేస్తూ వాళ్లలో ఒకడై పోతాడు. అపార్ట్ మెంట్ పిల్లలందరికీ ట్యూషన్ చెప్పే దివ్య మొదట్లో గణేష్ ను పట్టించుకోకపోయినా క్రమంగా అతనికి దగ్గరవుతుంది. మొదట్లో గణేష్ నాటకీయంగా ప్రేమించినా ఆతర్వాత సిన్సియర్ గానే ప్రేమలో పడతాడు. మరోవైపు మహదేవ్ ( ఆశిష్ విద్యార్థి) అనే దాదా అప్పులిచ్చి గూండాగిరి చేస్తూ అందర్నీ భయభ్రాంతులను చేస్తుంటాడు. మహదేవ్ చేసిన ఓ ఘాతుకాన్ని అక్కడే ఉండి గణేష్ పట్టించులేదనే (హీరో సూపర్ మాన్ కదా) కారణంగా గణేష్ పై పిల్లలు కత్తికడతారు. మరోవైపు ప్రేమనాటకం ఆడేందుకే గణేష్ వచ్చాడని దివ్యకు తెలిసిపోతుంది. తిరిగి పిల్లల మనసులను గణేష్ ఎలా గెలుచుకున్నాడు? తన ప్రేమలోని నిజాయితీని ఎలా నిరూపించుకున్నాడనేది మిగతా కథ.