'గణేష్' రివ్యూ
సాంకేతికపరంగా హరి అనుమోలు సినిమాటోగ్రఫీ ప్రధాన హైలైట్ గా నిలుస్తుంది. మిక్కీ జె.మేయర్ సంగీతం ఆయన గత సినిమాలతో పోల్చుకుంటే కొద్దిగా వాసి తగ్గినా హమ్మింగ్ చేసుకునే ట్యూన్ రెండు మూడు ఉన్నాయి. 'ఛలో ఛలో ఛల్ రే..' పాట చిన్నపిల్లలకు హషారు గొలుపుతూ చిత్రీకరణ పరంగా బాగుంది. అబ్బూరి రవి మాటలు సందర్భోచితంగా ఉన్నాయి. 'ఎంత సూపర్ మన్ లు, స్పైడర్ మాన్ లయినా లవ్ లో ప్రాబ్లం వస్తే అర్డనరీ మన్ లే..' (పిల్లలతో రామ్) 'ఎవరు కొడితే మైండ్ బ్లాంక్ అవుతుందో వాళ్ల బాసే గిరి..యాదగిరి'(బ్రహ్మానందం), 'నేను సింహాలతో మాట్లాడను..సింహాలు సింగిల్ గానే రావాలి' (సింహం గెటప్ లో ఉన్న హీరోతో హీరోయిన్), 'క్షమించే గుణం ఉన్నవారే ఎక్కువగా ప్రేమించగలరు' (హీరోయిన్ తో హీరో), 'ఒక్క అబద్ధాన్ని చూసి వంద నిజాలకు కళ్ళుమూసుకుంటున్నావు' (హీరోయిన్ తో హీరో) వంటి సంభాషణలు ఈ కోవలేనివే. శ్రీకరప్రసాద్ ఎడిటింగ్ మరింత క్రిస్ప్ గా ఉండాల్సింది. స్రవంతి రవికిషోర్ మంచి నిర్మాణ విలువలు పాటించారు.
సినిమాకి ప్రాణం ప్రథమార్థం. చిల్ట్రన్ ఎపిసోడ్లతో హిలేరియస్ ఎంటర్ టైన్ మెంట్ తో సాగింది. ద్వితాయార్థంపై అంచనాలను పెంచుతుంది. అయితే నిడివి విస్తారం కావడం, హీరోహీరోయిన్ల ప్రేమ ఘట్టాల్లో సాగతీత వంటివి సెకెండాఫ్ లో చోటు చేసుకున్నాయి. విలన్ చివర్లో పిల్లలతో తలపడే ఘట్టాలను కూడా క్రిస్ప్ చేసి ఉండొచ్చు. హీరో రామ్ ఎనర్జీ, పిల్లల నటన సినిమాకి ప్రధాన హైలైట్స్ అయితే, 16 రీళ్ల నిడివి, సెకెండాఫ్ లో వినోదం పాళ్లు తగ్గడం (ప్రథమార్థంతో పోల్చినప్పుడు), తేలిగ్గా ఊహించగలిగే ముగింపు వంటివి సినిమాపై ప్రేక్షకుల అంచనాల గ్రాఫ్ ను తగ్గిస్తుంది. ఓవరాల్ గా...గణేష్ పిల్లల్నిఆకట్టుకుంటాడు. వాళ్ల ద్వారా పెద్దల్నీ థియేటర్లకు రప్పించే అవకాశాలున్నాయి. జస్ట్ గణేష్ కాప్షన్ కు తగ్గట్టుగానే జస్ట్ ఓకే ఫిల్మ్ గా చెప్పొచ్చు.
Be first to comment on this News / Article!
Pages: -1- -2- -3- 4
|