'గణేష్' రివ్యూ
యూత్ ఫుల్ లవ్ స్టోరీని కిడ్స్ తో ముడిపెట్టి దర్శకుడు శరవణన్ సమాంతరంగా స్టోరీని నడిపే ప్రయత్నం చేసినప్పటికీ పిల్లల ఎపిసోడ్ క్రిస్ప్ గా ఉండి, లవ్ స్టోరీ మాత్రం సాగతీత తరహాలో సాగడం (ముఖ్యంగా సెకెండాఫ్ లో) కనిపిస్తుంది. ముఖ్యంగా ఐదు నిమిషాలు మాట్లాడే ఛాన్సిస్తే ఇక జీవితాంత డిస్ట్రబ్ చేయనని హీరో షరతు పెట్టి ఆ ఐదు నిమిషాలను నాలుగైదు సార్లు డివైడ్ చేసి కలుసుకునే ఘట్టాలను క్రిస్ప్ చేసుంటే నిడివి కూడా తగ్గి ఉండేది. పిల్లల నుంచి దర్శకుడు మంచి రిజల్ట్ రాబట్టారు. హీరోను సూపర్ మన్ ఫీట్స్ చేయమంటూ రెండు సందర్భాల్లో అపార్ట్ మెంట్ పైనుంచి కిందకు నెట్టేయడం, ఆకాశంలో వేలాడుతున్న బెలూన్ పై పేరు రాయమని చెప్పి గణేష్ పైకి ఎక్కగానే బెలూన్ తాడు కోసేయడం, బెలూన్ పట్టుకునే ఛార్మినార్, బిర్లామందిర్, ట్యాంక్ బండ్ బుద్ధవిగ్రహం దాటుకుంటూ విలన్ డాబాపై గణేష్ పడటం వంటివి పిల్లలతో పాటు పెద్దలకూ మంచి వినోదాన్ని పంచుతాయి. అలాగే హీరో ప్రేమను గెలిపించేందుకు నాని అనే ఓ బుడ్డోడు 70 శాతం మార్కులు తెచ్చుకుంటానంటూ పందెం కట్టి పడిన కష్టాలు, సూపర్ మాన్ అంటే పడిచచ్చే కళ్లజోడు కుర్రాడి చేష్టలు, సూపర్ మాన్ (హీరో) ను అనుమానంగా చూస్తూ చిక్కుల్లో పెట్టేందుకు ప్రయత్నించే హృతిక్ అనే బొద్దు కుర్రాడు ఘట్టాలను దర్శకుడు బాగా హ్యాండిల్ చేశారు. హీరో ఫైట్ లో 'రియల్ సూపర్ మన్ ' పంచ్ లు ఇచ్చినట్టు చూపించే షాట్స్ పిల్లలకు మంచి కిక్ ఇస్తాయి.
హీరో రామ్ ఈ చిత్రంతో నటనలో మరో మెట్టు ఎదిగారు. డాన్సులు, ఫైట్స్ లో అతని ఎనర్జీ మెచ్చుకోలుగా ఉంది. 'రాజకుమారీ రాజకుమారీ' అనే పాటలో శరీరం పైభాగం నెమ్మదిగా, క్రింది భాగం వేగంగా కదుపుతూ చేసే బిట్ అతను పడిన కష్టాన్ని చెబుతుంది. అలాగే 'నాన్ చాక్' తరహాలో ఉండే 'సెన్ సాక్ చుక్' వెపన్ తో అతను చేసిన ఫైట్ కూడా రిస్క్ తీసుకుని చేశారు. రామ్ సూపర్ మన్ ఫీట్స్
పిల్లల్ని మరోసారి అలరించడం ఖాయం. కాజల్ క్యూట్ గా కనిపిస్తూనే అభినయం పరంగానూ మంచి స్కోరింగ్ చేసింది. ఇందులో 26 మంది బాలనటులు పనిచేశారు. వీరి పేర్లను సినిమా చివరి టైటిల్స్ లో వేయడం సముచితం. కామెడీ టచ్ కూడా ఉన్న విలన్ గా ఆశిష్ విద్యార్థి తన పాత్రకు న్యాయం చేశారు. ఆశిష్ విద్యార్థి ప్రత్యర్థి అయిన యాదగిరి పాత్రలో బ్రహ్మానందం కొద్దిపాటి నవ్వులు పంచారు. హీరోయిన్ ఫ్రెండ్ గా పూనమ్ కౌర్ గ్లామర్ లుక్స్ తో అలరించింది. గెస్ట్ రోల్ లో సీనియర్ నటి రోహిణి హట్టంగిడి కనిపించారు.
Be first to comment on this News / Article!
Pages: -1- -2- 3 -4-
|